Vikram movie: కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా విక్రమ్. ఇందులో కమల్ విక్రమ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో కమల్‌తో పాటు ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవల కమల్‌హాసన్ బర్త్‌డే రోజు విడుదల చేసిన గ్లింప్స్ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు రేకెత్తాయి. కాగా, చాలా రోజుల బ్రేక్ తర్వాత.. ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. కోయంబత్తూర్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.
ఇప్పటి వరకు జరిగిన షూటింగ్లో కమల్- విజయ్ సేతుపతి కాంబినేషన్లో కొన్ని సీన్స్‌ను తెరకెక్కించగా.. ఫాహద్పై కొన్ని సన్నివేశాలను తీశారు. అయితే, తాజా షెడ్యూల్లో ఈ ముగ్గురు కలిసి షూటింగ్లో పాల్గొననున్నట్లు దర్శకుడు లోకేశ్ స్పష్టం చేశారు. యాక్షన్ సీక్వెన్స్ నేపథ్యంలో ఈ షెడ్యూల్ నడుస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలు ఉన్నారు మేకర్స్.
A small gift from me to you @ikamalhaasan sir ❤️
Happy Birthday Ulaganayagan 🙏https://t.co/hmoRIZAktJ#VikramFirstGlance#HBDKamalHaasan#KamalHaasan#Vikram_April2022#Vikram— Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 6, 2021
ఈ మధ్యకాలంలో కమల్ హాసన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో వెండితెరపై కనిపించలేదు. దాదాపు మూడేళ్లుగా ఆయన నటించిన సినిమా ఏదీ కూడా విడుదలవ్వలేదు. ‘ఇండియన్ 2’ సినిమా పలు కారణాల రీత్యా ఆగిపోగా… త్వరలోనే మళ్ళీ ప్రారంభం కానుంది. ఇక చాలా గ్యాప్ తరువాత ఆయన నటిస్తోన్న సినిమా కావడంతో విక్రమ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.