ఈఎస్‌ఐసీలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండానే?

ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థ నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరేలా చేసింది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అనెస్తీషియా, మైక్రోబయాలజీ, జనరల్‌ సర్జరీ, పీడియాట్రిక్స్, ఎమర్జెన్సీ […]

Written By: Navya, Updated On : November 18, 2021 10:07 am
Follow us on

ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థ నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరేలా చేసింది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

అనెస్తీషియా, మైక్రోబయాలజీ, జనరల్‌ సర్జరీ, పీడియాట్రిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్, డెర్మటాలజీ, రేడియాలజీ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్‌ /డీఎన్‌బీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 69 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.

ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది. డీఎన్‌ ఆఫీస్‌, అకెడమిక్‌ బ్లాక్‌, 2వ్ ఫ్లోర్, ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌, జోకా, కోల్‌కతాకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపడతారు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 1,01,000 రూపాయల నుంచి 1,77,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.