Project K  Movie : ఆగస్టు నుండి ప్రభాస్ ప్రాజెక్ట్ K సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్న కమల్ హాసన్..రెమ్యూనరేషన్ ప్రభాస్ కంటే ఎక్కువ!

ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో మాత్రమే కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో, అన్నీ భాషల్లో విడుదల కాబోతుంది.

Written By: Vicky, Updated On : June 15, 2023 1:29 pm
Follow us on

Project K  Movie : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమాలలో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాలలో ఒకటి ప్రాజెక్ట్ K. మహానటి దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా కి సంబంధించి రోజు కి ఒక లేటెస్ట్ న్యూస్ బయటకి వస్తూనే ఉంది. రీసెంట్ గా ఈ చిత్రం లో ప్రముఖ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

అదంతా కేవలం రూమర్స్ అని అనుకున్నారు అందరూ. కానీ కమల్ హాసన్ నిజంగానే ఈ సినిమా కి డేట్స్ ని కేటాయించాడు. ఆగష్టు నెల లో వరుసగా నెల రోజుల పాటు ఆయన తన డేట్స్ ని ఈ చిత్రం కోసం కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ 30 రోజులకు గాను కమల్ హాసన్ 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టు సమాచారం.

గత నెల రోజుల నుండి మూవీ టీం కమల్ హాసన్ తో చర్చలు జరుపుతూనే ఉంది, ఇప్పుడు ఆయన ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో టైం ట్రావెల్ కి తగ్గట్టుగా భారీ సెట్స్ ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రభాస్ , అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ , దీపికా పదుకొనే ఇలా సూపర్ స్టార్స్ అందరూ కలిసి ఒక భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం లో నటించడం అనేది చాలా అరుదు. ఈ జనరేషన్ కి సంబంధించిన ఆడియన్స్ ఇలాంటి కాంబినేషన్ ని చూస్తున్నందుకు నిజంగా ఎంతో అదృష్టవంతులు అనే చెప్పాలి.

ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో మాత్రమే కాదు, పాన్ వరల్డ్ రేంజ్ లో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో, అన్నీ భాషల్లో విడుదల కాబోతుంది. చూడాలి మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలు సృష్టించబోతుందో అనేది, మరో విశేహం ఏమిటంటే ఈ సినిమా కోసం ప్రభాస్ 80 నుండి 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. కానీ కమల్ హాసన్ రెమ్యూనరేషన్ వంద కోట్ల రూపాయిలు దాటి, 120 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.