Vikram collections: విక్రమ్ కలెక్షన్స్… బాక్సాఫీస్ వద్ద కమల్ విశ్వరూపం

Vikram collections: లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపిస్తున్నాడు. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. డొమెస్టిక్ అండ్ ఓవర్సీస్ లో విక్రమ్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతుంది. సాలిడ్ టాక్ సొంతం చేసుకున్న విక్రమ్ మూవీ మూడో రోజు ఆదివారం దుమ్ముదులిపింది. వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా విక్రమ్ థియేటర్స్ కి ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. కేరళలో విక్రమ్ రూ.10 కోట్ల గ్రాస్ […]

Written By: Shiva, Updated On : June 6, 2022 4:16 pm
Follow us on

Vikram collections: లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపిస్తున్నాడు. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. డొమెస్టిక్ అండ్ ఓవర్సీస్ లో విక్రమ్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతుంది. సాలిడ్ టాక్ సొంతం చేసుకున్న విక్రమ్ మూవీ మూడో రోజు ఆదివారం దుమ్ముదులిపింది. వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా విక్రమ్ థియేటర్స్ కి ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. కేరళలో విక్రమ్ రూ.10 కోట్ల గ్రాస్ క్రాస్ చేసింది. కరోనా తర్వాత ఈ ఫీట్ అందుకున్న కోలీవుడ్ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఇక చెన్నై సిటీ వసూళ్లు రూ. 5 కోట్లను దాటేశాయి.

kamal haasan

తమిళనాడులో మూడు రోజులకు గాను రూ. 67 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొదటి రోజుకు మించిన కలెక్షన్స్ మూడో రోజు వచ్చాయి. ఇక ఓవర్సీన్ లో కూడా అదే జోరు కొనసాగిస్తుంది. యూఎస్ లేటెస్ట్ సమాచారం మేరకు $1.7 మిలియన్స్ క్రాస్ చేసింది. మలేషియా, ఆస్ట్రేలియా,యూకే థియేటర్స్ లో విక్రమ్ స్ట్రాంగ్ హోల్డ్ కలిగి ఉంది. ఇక తెలుగులో మేజర్ నుండి గట్టి పోటీ ఎదురుకుంటున్న విక్రమ్… సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. వరల్డ్ వైడ్ గా తమిళ్,తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి రూ.90.5 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపిన విక్రమ్ బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది.

సోమవారం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఫస్ట్ వీక్ ముగిసే నాటికి విక్రమ్ 200 కోట్ల మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేయడం ఖాయం. ఇప్పటికే కమల్ పేరిట పలు నయా రికార్డ్స్ విక్రమ్ నమోదు చేసింది. దశవతారం చిత్రం తర్వాత కమల్ కి కమర్షియల్ హిట్ దక్కలేదు. ఇక కమల్ కెరీర్ లో అతిపెద్ద కమర్షియల్ హిట్ గా భారతీయుడు చిత్రం ఉంది. ఆ రేంజ్ హిట్ కమల్ విక్రమ్ తో అందుకునే ఛాన్స్ కలదు.

kamal haasan

దర్శకుడు లోకేష్ కనకరాజ్ రివేంజ్ యాక్షన్ డ్రామాగా విక్రమ్ తెరకెక్కించారు. నిషేదించబడిన ఒకప్పటి ఇండియన్ ఏజెంట్ గా కనిపించారు. ఇక ఫహద్ ఫాజిల్ స్పెషల్ ఆఫీసర్ రోల్ చేయగా… విజయ్ సేతుపతి డ్రగ్ మాఫియా లీడర్ పాత్ర చేశారు. ఇక సూర్య చివర్లో వచ్చి మెరుపు మెరిపించారు. రో్లెక్స్ సార్ అంటూ సూర్య క్లైమాక్స్ లో రావడం సినిమాకే హైలెట్. విక్రమ్ చిత్రానికి అనిరుధ్ బిజీఎమ్ ప్రాణం పోసింది.

Tags