Site icon OkTelugu

Samantha- Ranveer Singh: రన్వీర్ తో సమంత… క్రేజీ బాలీవుడ్ మూవీ ప్రకటించిన స్టార్ లేడీ!

Samantha- Ranveer Singh: సమంత ఖాతాలోకి ఓ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. ఆమె బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ సరసన ఛాన్స్ కొట్టేశారు. అధికారికంగా ప్రకటించనున్న తన ఫస్ట్ హిందీ చిత్రంపై హింట్ ఇచ్చింది. విడాకుల తర్వాత సమంత కెరీర్ పై ఫోకస్ పెట్టారు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. కొన్నాళ్ళుగా సమంత తన ఫోకస్ బాలీవుడ్ పై పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ప్రయత్నంలో ఆమె కల నెరవేరింది. సమంత సోషల్ మీడియాలో హీరో రన్వీర్ సింగ్ తో దిగిన ఫొటో ఒకటి షేర్ చేశారు. సదరు ఫొటోపై ఆమె స్వీటెస్ట్ ఎవర్ రన్వీర్ సింగ్ అంటూ కామెంట్ చేశారు.

Samantha- Ranveer Singh

సదరు ఫొటో సెట్స్ లో తీసినదిగా క్లియర్ గా తెలుస్తుంది. సమంత యూనిఫామ్ లో ప్రొఫెషనల్ గా కనిపిస్తున్నారు. రన్బీర్-సమంతల ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అలాగే ఓ అందమైన లొకేషన్ ఫొటో పంచుకున్న సమంత… త్వరలో ఓ ఆసక్తికర సంగతి చెబుతానంటూ హింట్ ఇచ్చింది. బహుశా ఆమె ఇచ్చే ఆ సర్ప్రైజ్ రన్వీర్ సింగ్ మూవీ గురించే కావచ్చు. చైతూ నుండి విడాకులు తీసుకున్న సమంత మకాం ముంబైకి మార్చారు. అక్కడ ఆమె ఓ ఖరీదైన ఇల్లు కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం సమంత హీరోయిన్ గా యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాలు తెరకెక్కుతున్నాయి. శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. యశోద చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. విజయ్ దేవరకొండ కి జంటగా తెరకెక్కుతున్న ఖుషి చిత్రీకరణ ఇటీవల మొదలైంది. అలాగే సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

Samantha- Ranveer Singh

మరోవైవు రన్వీర్ సింగ్.. లేటెస్ట్ జోర్దార్ జయేష్ భాయ్ అనుకున్నంత విజయం సాధించలేదు. దర్శకుడు రోహిత్ శెట్టి డైరెక్షన్ లో సర్కస్ మూవి చేస్తున్నారు. అలాగే కరణ్ జోహార్ దర్శకత్వంలో మరో మూవీ ఉంది. ఈ చిత్రంలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తారు. వీటితో పాటు అపరిచితుడు హిందీ రీమేక్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ పై కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి.
Recommended Videos


Exit mobile version