Murari: మన టాలీవుడ్ లో ఆల్ టైం క్లాసికల్ చిత్రాలు అత్యధికంగా కలిగి ఉన్న నేటి తరం హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రథమంగా ఉంటాడు. కెరీర్ ప్రారంభం లో ఆయనకీ అంత గొప్ప సినిమాలు పడ్డాయి. అలా మహేష్ బాబు కెరీర్ కి బాగా ఉపయోగపడి, అతనికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసిన చిత్రాలలో ఒకటి ‘మురారి’. ఆరోజుల్లో కుటుంబకథా చిత్రాలు తియ్యడం లో సిద్ధహస్తుడైన కృష్ణ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కుటుంబ కథా చిత్రాలలో మురారి ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఫ్యామిలీ డ్రామా తియ్యాలి అనుకునే ప్రతీ స్టార్ హీరోకి అప్పట్లో మురారి చిత్రం ఒక బెంచ్ మార్క్ గా ఉండేది.
నిన్న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తే ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. అభిమానులు కూడా ఊహించని రికార్డ్స్ ని నెలకొల్పుతూ ఈ చిత్రం సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి బిజినెస్ మెన్, ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. కేవలం ఒక్క రోజు మాత్రమే కాదు, నేడు , రేపు కూడా ఈ చిత్రానికి ఆన్లైన్ లో టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి. ఇకపోతే ఈ చిత్రం మహేష్ బాబు కి అప్పట్లో వరుసగా రెండు డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత తగిలింది. అయితే ఈ సినిమాని మహేష్ బాబు కంటే ముందుగా అక్కినేని సుమంత్ తో తియ్యల్సింది అట. అప్పటికే సుమంత్ హీరో గా ఎంట్రీ ఇచ్చి మూడు సినిమాలు చేసాడు. అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. నాగార్జున తో కృష్ణ వంశీ కి మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది. ఎందుకంటే నాగార్జున తో ఆయన ‘నిన్నే పెళ్లాడట’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తీసాడట. ఒక రోజు నాగార్జున కి కృష్ణ వంశీ మురారి చిత్ర కథని వినిపించాడట కృష్ణ వంశీ. కథ చాలా బాగుంది, ఈ కథ మా సుమంత్ తో చెయ్యి, నేనే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని నాగార్జున అన్నాడట.
కానీ కృష్ణవంశీ అందుకు ససేమీరా ఒప్పుకోలేదట. ఈ చిత్రాన్ని చేస్తే మీతోనే చేస్తాను, లేదంటే మహేష్ బాబు తో చేస్తాను అని చెప్పడంతో నాగార్జున కాస్త హర్ట్ అయ్యినట్టు అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, చివరికి ఈ కథ మహేష్ బాబు వద్దకి చేరింది. ఇక తర్వాత జరిగినవన్నీ మనకి తెలిసిందే. అయితే ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్ ఈ చిత్రం సుమంత్ కి కూడా బాగా సరిపోతుంది, అతను ఈ చిత్రం చేసుంటే కెరీర్ ఎంతో బాగుండేది, మంచి అవకాశం మిస్ అయ్యింది అంటూ కామెంట్ చేస్తున్నారు.