Kamal Haasan In Coolie: కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన సౌత్ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ'(Coolie Movie) చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి కావాల్సినంత రెస్పాన్స్ అయితే రాలేదు అనే చెప్పాలి. అందుకు కారణం అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. ప్రతీ సినిమాకు తన మ్యూజిక్ తో విపరీతమైన హైప్ ని తీసుకొచ్చే అనిరుద్(Anirudh Ravichander), ఈ సినిమాకు కూడా మ్యూజిక్ తో హైప్ తీసుకొచ్చాడు. కానీ ట్రైలర్ కి మాత్రం అసలు న్యాయం చేయలేకపోయాడు. అనిరుద్ నుండి ఇంత నీరసమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రావడం ఏంటి?, కలలో కూడా ఊహించలేదుగా ఇలా చేస్తాడని అంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. ఇది కాసేపు పక్కన పెడితే, ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ లో రజని మార్క్ హీరోయిజం మాత్రమే కాకుండా, ఎమోషనల్ సన్నివేశాలను కూడా బాగా చూపించారు.
Also Read: కూలీ ట్రైలర్ రివ్యూ: కాస్టింగ్, యాక్షన్ ఎక్కువ.. మ్యాటర్ తక్కువైందే!
ముఖ్యంగా శృతి హాసన్(Shruti Haasan) తో రజనీకాంత్(Superstar Rajinikanth) పలికే కొన్ని డైలాగ్స్ ని చూస్తుంటే కమల్ హాసన్(Kamal Haasan) గురించే మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ‘తను నీకు కేవలం నాన్న మాత్రమే..నాకు ప్రాణ స్నేహితుడు’ అంటూ చెప్పుకొస్తాడు. నిజ జీవితం లో కమల్ హాసన్ నిజంగా రజనీకాంత్ కి ప్రాణ స్నేహితుడే. శృతి హాసన్ ఆయన కూతురు కాబట్టి, ఇది కమల్ ని ఉద్దేశించి కొట్టిన డైలాగ్ అని అందరు అంటున్నారు. అంటే ఇందులో కమల్ హాసన్ కూడా ఉన్నాడా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ కమల్ ఇందులో నటించడం లేదు. ఇది కేవలం సినిమా కథకు సంబంధించిన డైలాగ్ మాత్రమే. చూస్తుంటే ఈ సినిమా తన ప్రాణ స్నేహితుడి కూతురిని విలన్స్ నుండి కాపాడుకునే పాత్ర లాగా అనిపిస్తుంది. బాషా సినిమా కథ కూడా ఇదే కదా.
హీరో తన ప్రాణ స్నేహితుడ్ని విలన్స్ చంపిన తర్వాత, తన స్నేహితుడి స్థానం లోకి వెళ్లి ఆయన కుటుంబ సబ్యులకు అండగా నిలుస్తాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ‘కూలీ’ కథ కూడా అలాగే కొనసాగేలా ఉంది. చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు కూడా ఈ ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. బాషా సినిమాని లోకేష్ కనకరాజ్ తన స్టైల్ లో తీస్తే ఎలా ఉంటుందో, అలా ఉంటుంది ఈ కూలీ చిత్రం అంటూ సోషల్ మీడియా లో ట్రైలర్ ని చూసి నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరో 12 రోజులు ఆగాల్సిందే.