Homeఎంటర్టైన్మెంట్Trivikram God of War: త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్' స్క్రిప్ట్ ని కాజేసిన కమల్...

Trivikram God of War: త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ స్క్రిప్ట్ ని కాజేసిన కమల్ హాసన్..ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకు ఊహించని ఝలక్!

Trivikram God of War: త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ‘గడ్ ఆఫ్ వార్’. పార్వతీ, పరమేశ్వరుల తనయుడు, కార్తికేయ స్వామి జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని కనీవినీ ఎరుగని రేంజ్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించాలి అనేది త్రివిక్రమ్ డ్రీం. కార్తికేయ స్వామి జీవిత చరిత్ర పై ఇండియన్ సినిమా హిస్టరీ లో ఇప్పటి వరకు ఒక్కరు కూడా సినిమా తీయలేదు. కేవలం కొన్ని ఘట్టాలను మాత్రమే వెండితెర పై చూపించారు. అదే విధంగా ఆయన మహాత్యాలపై మాత్రం ఎలాంటి సినిమా రాలేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తే ఆడియన్స్ బ్రహ్మరథం పడుతారని త్రివిక్రమ్ శ్రీనివాస్ బలమైన నమ్మకం. ఈ చిత్రం లో నటించడం కోసం ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్, మరో పక్క అల్లు అర్జున్ పోటీ పడుతున్నారు.

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ ఈ సినిమానే చేస్తాడని అంతా అనుకున్నారు, కానీ బౌండెడ్ స్క్రిప్ట్ ఇంకా రెడీ కాకపోవడం తో, అల్లు అర్జున్ అట్లీ సినిమాకు షిఫ్ట్ అయ్యాడు. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ పై కన్నేశాడు. త్రివిక్రమ్ తో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ ని తనకు దక్కేలా చేసుకున్నాడు. కానీ అల్లు అర్జున్ కూడా అసలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ సినిమాని తనతోనే చెయ్యాలని భీష్మించి కూర్చున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కి వీళ్లిద్దరు సన్నిహితులే, ఎవరికీ ఓకే చెప్పాలో అర్థం కాక సతమతం అవుతున్న ఈ తరుణంలో, శివ రాత్రి సందర్భంగా నిన్న ఒక్క సంచలన ప్రకటన వచ్చింది. మురుగన్ (తమిళం లో కర్త్రికేయ స్వామిని అలాగే పిలుస్తారు) జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని, త్వరలోనే ఒక భారీ సినిమాని నిర్మించబోతున్నట్టు, కమల్ హాసన్ నిన్న అధికారిక ప్రకటన చేశాడు.

ఈ చిత్రం లో హీరో గా శివ కార్తికేయన్ నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ లుక్ ని నిన్న విడుదల చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సరదాగా ట్వీట్లు వేస్తూ, ఈ సబ్జెక్టు కోసం మీరు మేము ఇన్ని రోజులు కొట్టుకున్నాం, ఒకరిపై ఒకరు ట్రోల్స్ వేసుకున్నాం, ఇప్పుడు ఇదే కథ పై తమిళం లో సినిమా వచ్చేస్తోంది, మన ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కి దూల తీరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాడులోని జనాలు అత్యధిక శాతం కొలిచే దేవుడు మురుగన్. అలాంటి మురుగన్ పై సినిమా తీసే అవకాశాన్ని తమిళియన్స్ ముందుగా మనకి ఎందుకు ఇస్తారు?, కాస్త ఆలోచించండి అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు అంటున్నారు. ఇక నేడు సాయంత్రం 5 గంటలకు శివ కార్తికేయన్ ‘గాడ్ ఆఫ్ వార్’ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular