Kamal Haasan Favourite Hero: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో నటన అంటే మన అందరికి ముందు గుర్తుకు వచ్చే పేరు కమల్ హాసన్..ఆయన చేసినన్ని పాత్రలు ఇండియా లో ఏ హీరో కూడా చెయ్యలేదు అనడం లో అతిసయోక్తి లేదు..తిరుగులేని స్టార్ హీరో గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద చలామణి అవుతున్న సమయం లో ఎక్కువ ప్రయోగాలు చెయ్యడం వల్ల కొంతకాలం ఆయన డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు..అలాంటి కమల్ హాసన్ కి ఇటీవల విడుదల అయినా విక్రమ్ సినిమా ఎలాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..దశావతారం తర్వాత కమల్ హాసన్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద తన విశ్వరూపం ని చూపించాడు..ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం విక్రమ్ సినిమా మేనియా తో ఊగిపోతోంది..ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ బట్టి చూస్తూ ఉంటే ఈ సినిమా ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టబోతుంది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట..తెలుగు లో కూడా ఈ సినిమా మొదటి రోజు నుండి నేటి వరుకు కలెక్షన్స్ పరంగా ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతోంది.

Also Read: Actress Gajala: గజాల ఆత్మహత్యాప్రయత్నం ఎందుకు చేసింది? ఆ హీరో వల్లనేనా?
ఇది ఇలా ఉండగా విక్రమ్ సినిమా విడుదల కి ముందు కమల్ హాసన్ ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..నటనకి ఎంబ్లెమ్ లాగా ఉండే కమల్ హాసన్ లాంటి నటుడికి నేటి తరం హీరోలలో ఎవరు యాక్టింగ్ పరంగా ఫేవరెట్ అనే విషయం ని తెలుసుకునే ఆత్రుత ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది..ఆ ఆత్రుతతోనే తెలుగు లో కమల్ హాసన్ పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూ లో కూడా యాంకర్లు ఇప్పుడు ఉన్న హీరోలలో మీకు ఇష్టమైన నటుడు ఎవరు అనే అడిగే ప్రయత్నం చేసారు..ఆ ప్రశ్నకి సమాధానం గా కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలు అందరూ యాక్టింగ్ లో కుమ్మేస్తున్నారు..ఎవ్వరు ఎక్కువ, ఎవరు తక్కువా అనేది చెప్పలేకపోతున్నాము..నటనలో ఆ స్థాయి పోటీతత్వం నడుస్తుంది ప్రస్తుతం..కానీ ఇటీవలే #RRR సినిమా చూసాను..రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరు కూడా అద్భుతంగా నటించారు..చాలా బాగా అనిపించింది..పుష్ప సినిమా కూడా చూసాను..అల్లు అర్జున్ కూడా అద్భుతంగా నటించాడు..ఈ సినిమాలే కాకుండా లాక్ డౌన్ సమయం లో రోజుకి మూడు సినిమాలు చూసేవాడిని..తెలుగు సినిమాలు కూడా చాలా చూసాను..ఇక్కడి యువ హీరోలలో కూడా చాలా టాలెంట్ ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు కమల్ హాసన్.

Also Read: Pawan Kalyan Tweets: జనసేన సైనికులారా జరభద్రం… పవన్ ట్విట్ల వెనుక కథ ఇదా?


