https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ ఎవరో తెలియదు అన్న ఆ స్టార్ హీరో..కట్ చేస్తే ప్రభాస్ సినిమాలోనే విలన్ గా చేస్తున్నాడు…

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాని కూడా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో మాత్రం చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు ప్రభాస్ ఎవరో మనకంత ఐడియా లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : March 16, 2024 / 12:26 PM IST

    Kamal Haasan and Prabhas

    Follow us on

    Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రభాస్ ని మించిన స్టార్ హీరో మరొకరు లీరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయన పాన్ ఇండియాలో వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లు అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన రాజా సాబ్, కల్కి(Kalki 2898) లాంటి సినిమాలను చేస్తున్నాడు.

    ఇక ఈ సినిమాలు ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాని కూడా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో మాత్రం చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు ప్రభాస్ ఎవరో మనకంత ఐడియా లేదు అని కమలహాసన్ (Kamal Haasan)ఒకానొక సందర్భంలో మీడియా ముందు అన్నాడు. ఇక కట్ చేస్తే విశ్వరూపం సినిమా రిలీజ్ అడ్డుకున్న క్రమంలో ప్రభాస్ ఆ సినిమాకి సపోర్టుగా వచ్చి కమల్ హాసన్ పక్కన కూర్చొని నా పేరు ప్రభాస్ అని తనని తాను పరిచయం చేసుకున్నాడు.

    దాంతో కమలహాసన్ అవుతూ ప్రభాస్ భుజాల మీద చేయి వేశాడు. అలా ప్రభాస్ తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో కమలహాసన్ విలన్ గా నటించడం విశేషం… ఇక ప్రస్తుతం ఇండియాలోనే ప్రభాస్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అతనికి అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారనే చెప్పాలి…

    అలా తను ఎవరో తెలియదని చెప్పిన కమలహాసన్ తోనే తన సినిమాలో విలన్ పాత్రని చేసేలా చేసిన ప్రభాస్ స్టార్ డమ్ గురించి మనం ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ తొందర్లోనే హాలీవుడ్ సినిమా చేసే స్థాయి కి వెళ్తాడు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు…