Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ పాపం ఆసుపత్రిలో చేరాడు . చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రస్తుతం కమల్ హాసన్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది. అసలు కమల్ ఆసుపత్రిలో ఎందుకు చేరారన్న వార్త అభిమానులు ఆందోళనకు గురి చేస్తోంది. కమల్ ఇటీవలే అమెరికా వెళ్లి తన దుస్తుల బ్రాండ్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

అయితే, భారత్ కు తిరిగి రాగానే కమల్ లో కరోనా లక్షణాలు కనిపించాయని టాక్ నడుస్తోంది. అయితే, మోమరోపక్క కోలీవుడ్ సిని వర్గాల అప్ డేట్ ప్రకారం.. కమల్ అమెరికా నుంచి వచ్చి కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని.. అందుకే చెన్నై శ్రీరామచంద్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు అని చేబుతున్నారు. మరో వారం లో కమల్ పూర్తిగా కోలుకుంటారని ఆసుపత్రి యాజమాన్యంస్పష్టం చేసింది.
Also Read: మహేష్ తో సాయి పల్లవి.. త్రివిక్రమ్ కూడా థ్రిల్ ఫీల్ అయ్యాడు !
అన్నట్టు కమల్ హసన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే.. బిగ్ బాస్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కమల్ ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమాలో మెయిన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. అలాగే కమల్ అటు శంకర్ దర్శకత్వంలో సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన ‘ఇండియన్-2’ షూటింగ్ లోనూ తిరిగి పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాకపోతే శంకర్ ఈ సినిమా విషయంలో చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. తనకు ఇండియన్ 2 సినిమా చేయాలని లేదని కూడా శంకర్ చెప్పాడట. అయితే, కమల్ మాత్రం కచ్చితంగా ఈ సినిమా ఫినిష్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాడట.
Also Read: పవన్ పై ఒత్తిడి పెంచేస్తున్న కమిట్మెంట్స్