Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఓ క్రేజీ బ్యూటీ యాక్ట్ చేయబోతుంది. హీరోయిన్ సాయి పల్లవి మహేష్ సిస్టర్ గా నటించబోతుందని కొత్త రూమర్ వినిపిస్తోంది. అయితే, ఈ రూమర్ లో వాస్తవం ఎంత ఉందని ఆరా తీస్తే ఇందులో ఎలాంటి నిజం లేదని త్రివిక్రమ్ టీంలోని ఓ సభ్యుడు చెప్పుకొచ్చాడు. ఇది కేవలం ఒట్టి రూమర్ మాత్రమే అని అతను తేల్చి చెప్పాడు.

అయితే, ఈ రూమర్ విని త్రివిక్రమ్ కూడా థ్రిల్ ఫీల్ అయ్యాడట. ఇదేదో బాగుందో అని ఆలోచనలో పడ్డాడట. మొత్తానికి ఈ రూమర్ త్రివిక్రమ్ వరకూ చేరిందట. ఇక ఈ సినిమా పై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ను సంతృప్తిపరచడానికి త్రివిక్రమ్ అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తోంది. దాంతో భారీ సీన్స్ రాయాల్సి వస్తోంది. సహజంగా త్రివిక్రమ్ కి కొన్ని అలవాట్లు ఉన్నాయి.
Also Read: ఆ కొత్త హీరోల మధ్య పోటీ.. ఎవరు గెలిచారు?
కాగా తన ప్రతి సినిమాలో తన అభిరుచికి తగ్గట్టు త్రివిక్రమ్ కచ్చితంగా ఓ భారీ ఫైట్ ను డిజైన్ చేస్తాడు. గమనిస్తే.. త్రివిక్ రమ్ ప్రతి సినిమాలో ఓ ప్రత్యేక ఫైట్ సీన్ ఉంటుంది. పైగా ఆ సీన్స్ అన్నీ ట్రాఫిక్ తో పాటు చిన్నపాటి గ్రాఫిక్స్ ను మిక్స్ చేసి ఉంటాయి. ఇప్పుడు మహేష్ సినిమా కోసం కూడా త్రివిక్రమ్ ఇదే తరహా ఫైట్ ను ప్లాన్ చేశాడు. మొత్తమ్మీద, త్రివిక్ రమ్.. మహేష్ సినిమా కోసం చాలా రకాలుగా ఆలోచిస్తున్నాడు.
అయితే, నటీనటుల ఎంపిక కూడా త్రివిక్రమ్ కి ఇప్పుడు అది పెద్ద సమస్య అయిపోయింది. ఒక పక్క ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ సినిమాలలో బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. మరి మహేష్ సినిమాలో కూడా పాన్ ఇండియా స్టార్స్ లేకపోతే బాగోదు అని డిస్ట్రీబ్యూటర్స్ ఇప్పటి నుంచే త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. దాంతో బడ్జెట్ అనుకున్న దాని కంటే రెండింతలు పెరిగే అవకాశం ఉంది.
మరి నిర్మాతలు ఏ ధైర్యంతో ముందుకు పోతారో చూడాలి. ఇక ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని, అలాగే పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా చూపిస్తారట. ఓ సామాజిక అంశాన్ని కూడా సినిమాలో ప్రముఖంగా ప్రస్తావించబోతున్నారని తెలుస్తోంది. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలుకాబోతుంది .
Also Read: పంజాబ్ ఎన్నికలు వాయిదా.. ఈసీ కీలక నిర్ణయం