Rajamouli: కరోనా ఆంక్షలతో ఏ పనీ ప్రణాళిక ప్రకారం సాగడం లేదు. సాధారణ రోజుల్లోనే నిర్మాతలు థియేటర్స్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఇక విడుదల తేదీలు వెనక్కిపోయి, సినిమాలు జామ్ అయితే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితి అలానే ఉంది. జనవరి నెలలో విడుదల కావాల్సిన పెద్ద చిత్రాలు ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వాయిదా పడ్డాయి. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. భీమ్లా నాయక్ ఆర్ ఆర్ ఆర్ నిర్మాతల ఒత్తిడితో సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది.

ధైర్యం చేసి సంక్రాంతి బరిలో దిగిన బంగార్రాజు సీజన్ పూర్తిగా క్యాష్ చేసుకుంది. చెప్పుకోదగ్గ పోటీ లేకుండా విడుదలైన బంగార్రాజు చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తుంది. వీకెండ్ ముగిసే నాటికి పెట్టుబడిలో సగం పైగా రాబట్టేసింది. నాగార్జున కెరీర్ లో ఫస్ట్ వంద కోట్ల చిత్రం బంగార్రాజు అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మూడు రోజుల్లో రూ. 53 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు.
Also Read: మహేష్ తో సాయి పల్లవి.. త్రివిక్రమ్ కూడా థ్రిల్ ఫీల్ అయ్యాడు !
తెలుగు రాష్ట్రాల్లో బంగార్రాజు జోరు మామూలుగా లేదు. థియేటర్స్ సంఖ్య కూడా పెంచుతున్నారని సమాచారం. ఇదంతా కేవలం రాజమౌళి, ప్రభాస్ నిర్ణయం వలెనే. ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ విడుదల వాయిదా పడకుంటే బంగార్రాజు సంక్రాంతికి విడుదలయ్యేది కాదు.ముఖ్యంగా రాజమౌళి నిర్ణయాలు గేమ్ మొత్తం మార్చేశాయి.తనకు తెలియకుండానే రాజమౌళి నాగార్జునకు ఫుల్ ఫేవర్ చేశాడు. రాజమౌళి నాగార్జునకు చేసిన ఫేవర్ భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేయించడం. కేవలం రాజమౌళి ఒత్తిడితోనే భీమ్లా నాయక్ సంక్రాంతి రేసు నుండి తప్పుకుంది.
భీమ్లా నాయక్ అనుకున్న విధంగా విడుదలైతే… సంక్రాంతి చిత్రాలుగా బంగార్రాజు, భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద పోటీపడేవి. అది నాగార్జున సినిమాకు చాలా నష్టం చేకూర్చేది. నెగిటివ్ రివ్యూలు తెచ్చుకున్న బంగార్రాజు సినిమాకు ఈ స్థాయి వసూళ్లు ఉండేవి కావు. సంక్రాంతి సీజన్ ని భీమ్లా నాయక్ పూర్తిగా ఎటువంటి పోటీ లేకుండా క్యాష్ చేసుకునేది. రాజమౌళి నిర్ణయాలు నాగార్జున నెత్తి మీద పాలు పోస్తే.. పవన్ కి తీరని చేటు చేశాయి.
పాన్ ఇండియా చిత్రాలుగా ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ బాక్సాఫీస్ రేసు నుండి తప్పుకోవడం వలన హవా మొత్తం భీమ్లా నాయక్ దే అయ్యేది. టికెట్ రేట్లతో సంబంధం లేకుండా భీమ్లా నాయక్ భారీ ఓపెనింగ్స్ దక్కించుకునేది. తగ్గించిన ధరలే ఏపీలో అమలులో ఉండగా.. బంగార్రాజు రికార్డు కలెక్షన్స్ రాబడుతున్న విషయం మనం గమనించాలి. ప్రతి గింజ మీద తినేవాడి పేరుంటుందన్నట్లు… 2022 సంక్రాంతి కలెక్షన్స్ నాగార్జున దోచుకోవాలని రాసుంది. అందుకే రాజమౌళి అలాంటి నిర్ణయాలు తీసుకునేలా విధి ప్రేరేపించింది.
Also Read: పంజాబ్ ఎన్నికలు వాయిదా.. ఈసీ కీలక నిర్ణయం
[…] Atithi Devobhava: ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్ గా వచ్చిన ‘అతిధి దేవోభవ’ సినిమా కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద క్లోజ్ అయ్యాయి. కలెక్షన్స్ ఎలా వచ్చాయి అని అడగడం వేస్ట్. ఎందుకంటే. చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నట్టు ఉంది పరిస్థితి. అసలు ఈ ‘అతిథి దేవో భవ’కి రూ.1.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా వరల్డ్ వైడ్ గా 0.24 కోట్లును మాత్రమే. బయ్యర్లు ఈ సినిమా దెబ్బకు ఫుల్ గా లాస్ అయ్యారు. నిర్మాతలు కూడా ఈ సినిమాతో భారీగానే నష్టపోయారని వేరే చెప్పక్కర్లేదు. పొలిమేర నాగేశ్వర్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి విపరీతమైన డిజాస్టర్ టాక్ తో కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. […]