https://oktelugu.com/

Kalyan Ram: ఎన్టీయార్, ప్రశాంత్ నీల్ సినిమాలో కళ్యాణ్ రామ్..క్యారెక్టర్ ఏంటంటే..?

ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన ఎలివేషన్స్ కి ఎన్టీఆర్ సరిగ్గా సరిపోతాడు అంటూ చాలామంది ఇప్పటికే వీళ్ల కాంబినేషన్ మీద కామెంట్స్ అయితే చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : February 5, 2024 / 10:07 AM IST
    Follow us on

    Kalyan Ram: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అతి చిన్న ఏజ్ లోనే హీరోగా మారి, 20 సంవత్సరాలకే ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పుడున్న స్టార్ హీరోలకి సైతం పోటీ ఇచ్చిన ఒకే ఒక హీరో ఎన్టీయార్…ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియాలో సోలో హీరోగా తన సత్తాను చాటుకోవాలని చూస్తున్నాడు. అయితే ఇంతకు ముందు రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీయార్ కూడా స్క్రీన్ ని పంచుకున్నాడు. ఇక ఈ సినిమా భారీ వసూళ్లను సాధించినప్పటికీ ఆ సినిమా క్రెడిట్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ కి వెళ్లిపోయింది.

    కాబట్టి ఇక తను సోలో గా ఒక భారీ సక్సెస్ కొట్టి తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాని చేస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా సలార్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కూడా ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్నాడు.అయితే ఈ సినిమా కూడా డార్క్ మోడ్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయడం విశేషం.

    ఇక ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన ఎలివేషన్స్ కి ఎన్టీఆర్ సరిగ్గా సరిపోతాడు అంటూ చాలామంది ఇప్పటికే వీళ్ల కాంబినేషన్ మీద కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక ఇప్పుడూ అందుతున్న సమాచారం ఏంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ వాళ్ళ అన్నయ్య అయిన నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ఫ్రెండ్ గా కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఫ్రెండ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాలో కూడా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కి ఫ్రెండ్ గా కనిపించి ఆ తర్వాత తన నుంచి దూరమైపోతాడని దానివల్లే కొంతమంది మీద ఎన్టీఆర్ రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరమైతే ఏర్పడుతుందట.

    ఇక స్క్రీన్ మీద ఎన్టీఆర్ ఒక్కడిని చూస్తేనే అతని ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. అలాంటిది అన్నదమ్ములు ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద చూస్తే ఇక నందమూరి అభిమానులకి కన్నుల పండుగనే చెప్పాలి…ఇక ఈ సినిమా ఈ ఇయర్ సమ్మర్ లో సెట్స్ మీదికి వెళ్తుంది. వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది.