
Kalpika Ganesh- Dhanya Balakrishna: ధన్య బాలకృష్ణన్, కల్పిక గణేష్ మధ్య చెలరేగిన వివాదం ఇప్పట్లో చల్లారే అవకాశం కల్పించడం లేదు. ఇద్దరూ సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు.. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కల్పిక… ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడింది.. ఆ వివాదానికి సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చింది..” నన్ను ధన్య ఓ తాగుబోతుని చేసింది.. సంతోషం.. ఆమెను నేను హైదరాబాద్ రమ్మంటున్న.. ఇద్దరం కలిసి తాగుదాం. అన్ని విషయాలు మాట్లాడుకుందాం” అని బాంబు పేల్చింది.. ఈ వివాదానికి కారణం ఏంటని అడిగితే అది ఆమె చెప్పాలని బంతిని ధన్య కోర్టులోకి నెట్టింది.
కల్పిక గణేష్ తెలుగు వారికి పరిచయం అక్కరలేని పేరు.. ఈమె యశోద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, ప్రయాణం వంటి సినిమాల్లో నటించింది.. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది.. ఇందులో భాగంగానే ఆ మధ్య ధన్య టాపిక్ వచ్చినప్పుడు… తాను మారి,మారి_2 దర్శకుడు బాలాజీ మోహన్ తో రిలేషన్ లో ఉందని స్పష్టం చేసింది.. ఇప్పటికే అతడికి ఒక పెళ్లి జరిగి విడాకులు అయిందని, తర్వాత ధన్య అతడిని రహస్యంగా వివాహం చేసుకుందని బాంబు పేల్చింది. మొదట్లో వారిద్దరు అన్యోన్యంగా ఉండరు అనుకున్నానని, ఇప్పుడు బాగానే ఉంటున్నారని వివరించింది.. ఈ వీడియో ధన్యకు ఎక్కడాలేని చిరాకు తెప్పించింది. తన వ్యక్తిగత జీవితం మీద కల్పికకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అని మండిపడింది.. తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం నడుస్తూనే ఉంది.

అయితే ఇండస్ట్రీలో ధన్యకు ఓ తమిళ స్టార్ హీరోతో రిలేషన్ ఉంది.. అతడి సహాయంతో కల్పిక చేసిన యూట్యూబ్ వీడియోను తొలగించింది. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన కల్పిక… కంటెంట్ పేరు చెప్పి తన వీడియో తొలగించే అవకాశం మీకు ఎక్కడిదని ఆరోపించింది. ఇక అప్పటినుంచి ధన్య మీద ఆరోపణలు తీవ్రతరం చేసింది.. ధన్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, ఆల్కహాలిక్ అని కూడా ప్రచారం చేసింది.. దీంతో ధన్య కూడా అదే స్థాయిలో రెచ్చిపోయింది. తాజాగా ఈ వివాదాన్ని మరింత రచ్చ రచ్చ చేసింది.. ఇది మునుముందు ఎటు దారి తీస్తుందో తెలియదు కానీ.. ఈ వివాదాన్ని యూట్యూబర్లు మంచిగా క్యాష్ చేసుకుంటున్నారు.