Kalki 2898 AD Trailer Review : కల్కి ట్రైలర్ ఏంటి ఇలా ఉంది.. ఇలా అయితే ఇండస్ట్రీ హిట్ కొట్టడం కష్టమేనా..?

Kalki 2898 AD Trailer Review ఇక ప్రభాస్ ఈ ట్రైలర్ లో ఒకటి రెండు డైలాగులు అయిన చెబితే బాగుండేది అనే ఫీలింగ్ లోనే తన అభిమానులు అయితే ఉన్నారు.

Written By: NARESH, Updated On : June 10, 2024 8:25 pm

Kalki 2898 AD Trailer Review

Follow us on

Kalki 2898 AD Trailer Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్…ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ కోసం చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ సినిమాని ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లో ప్రభాస్ అద్భుతమైన పర్ఫామెన్స్ ని చూపిస్తాడు అనుకుంటే ఒకటి రెండు షాట్స్ కు మాత్రమే తనను పరిమితం చేశారు.

ఇక విజువల్స్ పరంగా బాగున్నప్పటికీ ప్రభాస్ కి ఒక్క డైలాగు లేకుండా చూపిస్తూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పరిచయం చేశారు. అయితే దీని ద్వారా సగటు ప్రేక్షకుడికి ఈ ట్రైలర్ అనేది అంతగా రీచ్ అయితే అవ్వలేదు. ప్రభాస్ ను కొంత సేపు చూపించి ఆయనకు ఒక డైలాగును పెడితే బాగుండేది కదా అంటూ ప్రభాస్ అభిమానులు గాని, బీసీ సెంటర్లో ఉన్న ఆడియన్స్ గానీ వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే కల్కి సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఏర్పడలేదు.

ఇక ఈ ట్రైలర్ తో అయిన ఆ అంచనాలను పీక్ స్టేజ్ లోకి తీసుకెళ్తారు అనుకుంటే ట్రైలర్ కూడా ఆశించిన మేరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయింది. కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకుడికి ప్రస్తుతం ఎలాంటి అభిప్రాయం అయితే ఏర్పడటం లేదు. మరి ఈ సినిమా రిలీజ్ అయి ఒకవేళ సక్సెస్ టాక్ వస్తే తప్ప బీసీ సెంటర్ లోని ఆడియన్స్ ఈ సినిమాని చూసే విధంగా అయితే కనిపించడం లేదు.

మరి ఇలాంటి క్రమంలో నాగ్ అశ్విన్ ఎందుకు ట్రైలర్ ని ఇలా రిలీజ్ చేశాడు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రభాస్ ఈ ట్రైలర్ లో ఒకటి రెండు డైలాగులు అయిన చెబితే బాగుండేది అనే ఫీలింగ్ లోనే తన అభిమానులు అయితే ఉన్నారు. చూడాలి మరి కల్కి సినిమా ఎలాంటి రిజల్ట్స్ ని నమోదు చేసుకుంటుంది అనేది…