Kalki 2898 AD Trailer :  కల్కి 2829 AD ట్రైలర్ రివ్యూ: యుద్ధం ఆ ఇద్దరి మధ్యే, కథ చెప్పేసిన నాగ్ అశ్విన్!

Kalki 2898 AD Trailer పద్మను తెచ్చి ఇస్తానని యాస్ కి భైరవ ఆఫర్ ఇస్తాడు. అప్పుడు భైరవ, అశ్వథామ మధ్య యుద్ధం మొదలవుతుంది.

Written By: NARESH, Updated On : June 10, 2024 8:05 pm

Kalki 2898 AD Trailer

Follow us on

Kalki 2898 AD Trailer : అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న కల్కి 2829 AD ట్రైలర్ వచ్చేసింది. మరి ట్రైలర్ ఎలా ఉంది? అంచనాలు అందుకుందా?… రివ్యూలో చూద్దాం. కల్కి ట్రైలర్ పై ఆసక్తి పెరగడానికి కారణం ఈ సినిమా గురించి ఆడియన్స్ లో ఎలాంటి అవగాహన లేదు. ఒక్కో పాత్రను పరిచయం చేశారు. ఈ పాత్రల మధ్య సంబంధం ఏమిటనేది తెలియదు. అలాగే మధ్యలో బుజ్జి క్యారెక్టర్ కన్ఫ్యూజ్ చేసింది. కల్కి చిత్రంలో ప్రభాస్ భైరవ రోల్ చేస్తున్నాడు. ఆ భైరవ ఫ్రెండ్ గా బుజ్జి కనిపిస్తుంది. బుజ్జి ఒక కారు. ప్రభాస్ సాహసోపేత ప్రయాణంలో అది తోడుగా ఉంటుంది.

బుజ్జి కేంద్రంగా ప్రమోషన్స్ జరిగాయి. కాబట్టి కల్కి సినిమా ఎలా ఉంటుందనేది ట్రైలర్ చూస్తే కానీ అవగాహన రాదని జనాలు ఫిక్స్ అయ్యారు. జూన్ 10న వరల్డ్ వైడ్ కల్కి ట్రైలర్ విడుదల కాగా… ఆడియన్స్ థ్రిల్ అయ్యారు. ముఖ్యంగా కల్కి కథపై నాగ్ అశ్విన్ ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చాడు. జనాల అయోమయాలు తొలగించాడు.

కల్కి చిత్ర కథ విషయానికి వస్తే… విశ్వం లో కాంప్లెక్స్ అనే ప్రపంచం ఉంటుంది. దాని అధిపతి యాస్. హీరో భైరవ కాంప్లెక్స్ కి వెళ్లాలని కలలు కంటూ ఉంటాడు. కాంప్లెక్స్ కి వెళ్లాలంటే వన్ మిలియన్ యూనిట్స్ కావాలి. మన భాషలో చెప్పాలంటే డబ్బులు. వాటి కోసం భైరవ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో యాస్ కి పద్మ(దీపిక పదుకొనె)కావాలి. పద్మ కడుపులో ఓ బిడ్డ పెరుగుతూ ఉంటుంది. ఆ బిడ్డకు రక్షణగా అశ్వద్ధామ(అమితాబ్ బచ్చన్) ఉంటాడు.

పద్మను తెచ్చి ఇస్తానని యాస్ కి భైరవ ఆఫర్ ఇస్తాడు. అప్పుడు భైరవ, అశ్వథామ మధ్య యుద్ధం మొదలవుతుంది. ట్రైలర్ ప్రకారం ఇది కథ. విజువల్స్ హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తగ్గని రీతిలో ఉన్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ని ఎంత పొగిడినా తక్కువే. బలమైన పాత్రలు, వారి కాస్ట్యూమ్స్, మేకప్స్ కృత్రిమంగా కాకుండా సహజంగా ఉన్నాయి. సినిమాలో బలమైన కథ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆడియన్స్ కి కనెక్ట్ అయితే నాగ్ అశ్విన్ చరిత్ర సృష్టించడం ఖాయం. ఇది ప్యూర్ గా నాగ్ అశ్విన్ మ్యాజిక్ అవుతుంది. కల్కి జూన్ 27న విడుదల కానుంది.