Central Cabinet : కేంద్రంలో ఏపీకి కీలక శాఖలు దక్కాయి. ఏపీ నుంచి ముగ్గురు కేంద్ర క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరూ టిడిపి నుంచి మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈరోజు వారికి శాఖలను కేటాయించారు. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయానం, పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ దక్కింది. రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ హోదా దక్కగా… పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి పదవి దక్కించుకోగలిగారు.
శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ కొట్టారు రామ్మోహన్. తండ్రి ఎర్రన్నాయుడు అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1996లో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రం నాయుడు కేంద్ర క్యాబినెట్లో చోటు తగ్గించుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మరోసారి ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకోవడం విశేషం.
ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీతో పాటు జెడిఎస్ కీలక భాగస్వామ్యంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రాధాన్యమిస్తూ పౌరవిమానయానం లాంటి బిజీ ట్రెండింగ్ శాఖను రామ్మోహన్ నాయుడుకు అప్పగించడం శుభ పరిణామం.
మరోవైపు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి పదవి లభించింది. వి మొత్తానికైతే కేంద్ర క్యాబినెట్ లో ఏపీకి సముచిత స్థానం లభించింది.