SS Rajamouli : రాజమౌళి కి ఈ డైరెక్టర్ ను చూస్తే కోపం వేస్తుందట…

SS Rajamouli కల్కి సినిమా చూసిన తర్వాత నాగ్ అశ్విన్ ను చూస్తే రాజమౌళి కి చాలా కోపంగా కూడా ఉందట. ఎందుకంటే కొన్ని కీలకమైన సన్నివేశాలను నాగ్ అశ్విన్ చాలా మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేసిన విధానం రాజమౌళికి నచ్చిందట.

Written By: Gopi, Updated On : June 28, 2024 12:47 pm

Kalki 2898 AD, Rajamouli

Follow us on

SS Rajamouli – : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక మహేష్ బాబుతో చేయబోయే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక మొన్నటి దాకా పాన్ ఇండియాలో సినిమాలు మాత్రమే చేసిన రాజమౌళి ఇప్పుడు వరల్డ్ సినిమాలు చేయడంతో ఒక్కసారిగా హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుగు సినిమాల వైపు చూసే అవకాశం అయితే ఉంది.

ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన షెడ్యూల్ ప్లానింగ్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాతో తనను తాను వరల్డ్ లోనే ది బెస్ట్ డైరెక్టర్స్ తో పోటీ పడాలని రాజమౌళి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మన తెలుగు సినిమా స్థాయి అనేది వరల్డ్ సినిమా స్థాయికి చేరుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా కల్కి సినిమా రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే..

అయితే ఈ సినిమా దర్శకుడు అయిన నాగ్ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కించిన విధానాన్ని చూసిన ప్రేక్షకులందరూ ఆయన గురించి చాలా స్పెషల్ గా చెబుతున్నారు. ఇక అందులో భాగంగానే రాజమౌళి కూడా ఈ సినిమా గురించి కొన్ని గొప్ప మాటలు చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే ఇంతకుముందు వరకు రాజమౌళి తనకు పోటీగా సందీప్ రెడ్డివంగా ఒక్కడే ఉన్నాడు అని చెప్పేవాడు. ఇకమీదట నాగ్ అశ్విన్ కూడా తనకు పోటీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.

ఇక కల్కి సినిమా చూసిన తర్వాత నాగ్ అశ్విన్ ను చూస్తే రాజమౌళి కి చాలా కోపంగా కూడా ఉందట. ఎందుకంటే కొన్ని కీలకమైన సన్నివేశాలను నాగ్ అశ్విన్ చాలా మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేసిన విధానం రాజమౌళికి నచ్చిందట. కానీ ప్రొఫెషనల్ వైజ్ గా చూసుకుంటే నాగీ తనకు పోటీ ఇస్తున్నాడు కాబట్టి ఆయన మీద కొంచెం కోపంగా ఉన్నట్టుగా రాజమౌళి నవ్వుతూ ఆ విషయాలను చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది…