Vijayashanthi : విజయ శాంతి కొత్త సినిమా గెటప్ చూస్తే అవ్వాక్కవుతారు…

Vijayashanthi ఇక ఇప్పటికే ఆయన గత సంవత్సరం చేసిన డెవిల్ సినిమాతో ఒక ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు. ఇంకా ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ను సాధించి మార్కెట్ లో తన క్రేజ్ ను పెంచుకోవాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది

Written By: NARESH, Updated On : June 24, 2024 8:08 pm

Vijayashanthi

Follow us on

Vijayashanthi : లేడీ అమితాబ్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి విజయశాంతి…మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకెవరు’ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన విజయశాంతి ప్రస్తుతం ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆమె ఎలాగైనా సరే ఒక మంచి సక్సెస్ సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక సరిలేరు నీకెవరు సినిమా తర్వాత ఆమె మరొక సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న కొత్త సినిమాలో తను ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం…ఒకప్పుడు కర్తవ్యం సినిమాలో తన నట విశ్వరూపాన్ని ఎలాగైతే చూపించిందో అలాంటి పాత్రలోనే ఇప్పుడు కూడా నటించడానికి రెడీ అవుతుంది.

ఇక రీసెంట్ గా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఆమె చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా పవర్ ఫుల్ పాత్ర లో మరొకసారి తనను తాను చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక సూపర్ సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతుంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే విజయశాంతి పాత్ర ఈ సినిమాలో కీలకం గా మారబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో మరొక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఆయన గత సంవత్సరం చేసిన డెవిల్ సినిమాతో ఒక ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు. ఇంకా ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ ను సాధించి మార్కెట్ లో తన క్రేజ్ ను పెంచుకోవాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి కళ్యాణ్ రామ్ మరోసారి ఈ సినిమాతో మరోసారి ‘బింబిసారా ‘ సినిమా లాంటి భారీ సక్సెస్ ను అందుకుంటాడా లేదా అనేది…