Kalki 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే నాగ్ అశ్విన్ (Nag Ashwin) లాంటి డైరెక్టర్ ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) తో సినిమాను చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆయన చేసిన కల్కి (Kalki) సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 1200 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం ఆయన ‘కల్కి 2’ (Kalki 2) సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తిచేసే పనిలో ఆయన బిజీగా ఉన్నట్టుగా తెలిస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా కొన్ని కీలకమైన అంశాలను చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. పాన్ ఇండియాలో 2000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాలనే ఉద్దేశంతో నాగ్ అశ్విన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాలను సృష్టిస్తాడు. తద్వారా ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ఆయనకు ఎనలేని గుర్తింపు అయితే ఉంది.
Also Read : కల్కి 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన అమితాబ్… ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్
మరి ఇలాంటి సందర్భంలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారు. ఇక ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన ‘కల్కి 2’ సినిమా మీద హైప్ ని పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్కి సినిమా గురించి చెబుతూ కల్కి 2 సినిమాలో ప్రభాస్ నెక్స్ట్ లెవెల్లో కనిపించబోతున్నాడు. ఇక కమల్ హాసన్ కి ప్రభాస్ కి మధ్య ఒక భారీ యుద్ధమే జరగబోతుంది అంటూ ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో ఇండస్ట్రీలో ఏదో ఒక వైవిధ్యాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి.
మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడంతో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా భారీ విజయాలను సాధించే విధంగా ముందుకు దూసుకెళ్తూ ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.