Maruti SUV: కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో SUVలకు డిమాండ్ పెరిగిపోతుంది. చాలా మంది చిన్న కార్లను కాదని ఎస్ యూవీలనే ఎక్కువగా కోరుకుంటున్నారు. విశాలమైన స్పేస్ తో పాటు ఇంజిన్ సామర్థ్యం ఎక్కువగా ఉన్న వాటికే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఎస్ యూవీల సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. లేటేస్టుగా మారుతికి చెందిన దాదాపు అన్ని ఎస్ యూవీ మోడళ్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఈ కంపెనీకి చెందిన Francks ఎస్ యూవీ మార్కెట్లోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే రూ. లక్ష యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇంకా ఏ యే మోడళ్ల సేల్స్ ఎలా ఉన్నాయంటే?
దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ ది బెస్ట్ కంపెనీగా ఉంటోంది. దీని నుంచి మార్కెట్లోకి వచ్చిన ఏ మోడల్ కారు అయినా ఆదరణ ఎక్కువగా పొందుతుంది. లేటేస్ట్ గా ఈ కంపెనీకి చెందిన SUV కార్లు అత్యధికంగా సేల్స్ అవుతున్నాయి. కంపెనీ తెలిపిన వివరాలు ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి మారుతికి సంబంధించిన అన్ని ఎస్ యూవీలు 4.43 లక్షలు సేల్స్ అయ్యాయి. ఇది 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 2.02 లక్షలు మాత్రమే ఉంటున్నాయి. అయితే 2024 ఏడాదిలో ప్రారంభించిన ఫ్రాంక్స్, జిమ్మీ సేల్స్ విపరీతంగా పెరగడం విశేషం.
చిన్న కార్ల ధరలు పెరగడంతో పాటు ఎస్ యూవీలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వీటిని ఎక్కువగా కోరుకున్నారు. ఎక్కువగా హ్యచ్ బ్యాక్ వేరియంట్లను ఉత్పత్తి చేసే మారుతి సుజుకీ చాలా ఆలస్యంగా ఎస్ యూవీ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో ఈ కంపెనీకి చెందిన ఎస్ యూవీలు అంతగా ఆకట్టుకోలేదు. 2020 ఏడాదిలో మారుతి మార్కెట్ వాటా మార్కెట్లో 47.7 శాతం ఉండేది. 2023లో ఇది 41.3 శాతానికి తగ్గింది. అయితే 2024లో తిరిగి 41. 6 శాతానికి పెరిగింది. ఇది ఎస్ యూవీల విక్రయాల వల్లే సాధ్యమైందని తెలుస్తోంది.
మారుతి సుజుకీ నుంచి ప్రస్తుతం ఫారెక్స్ క్రాసోవర్, బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్ యూవీ, గ్రాండ్ విటారా, జిమ్నీ లు మంచి సేల్స్ ను నమోదు చేసుకుంటున్నాయి. ఇక ఈ కంపెనీ మినీ సెగ్మెంట్ విక్రయాలు డౌన్ అయ్యాయి. ఇవి 2023 ఆర్థిక సంవత్సరంలో 2.33 లక్షలు ఉండగా.. 2024 ఆర్థిక సంవత్సరంలో 1.42 లక్షలకు తగ్గాయి. అయితే ఎస్ యూవీల వేరియంట్లు పెరిగినా.. మినీ సెగ్మెంట్ల అమ్మకాలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని కంపెనీ తెలుపుతోంది.