Kalki 2 : ఇప్పటివరకు చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. తెలుగు హీరోలు పాన్ ఇండియాలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటినుంచి మన హీరోల డామినేషన్ అయితే మొదలైంది…బాలీవుడ్ హీరోలు ఎలాంటి సినిమా చేయాలో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో పడ్డారు. ఎందుకంటే మన హీరోలు చేసే సినిమాలకు ప్రేక్షకుల్లో ఎక్కువ ఆదరణ అయితే దక్కుతోంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా మాస్ సినిమాలను చేయలేరు. అలాంటి సినిమాలను చేయాలేని పక్షాన వాళ్ళు చేసే సినిమాలు డిజాస్టర్ల బాట పడుతుంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read : కల్కి 2 పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన అమితాబ్… ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్
యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్(Prabhas)…ఆయన చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు… సలార్(Salaar), కల్కి(Kalki) లాంటి సినిమాలతో డిఫరెంట్ జానెర్స్ లో సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రభాస్ లాంటి నటుడు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళుతున్న హీరోల్లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంలో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక కల్కి (Kalki) సినిమా సూపర్ సక్సెస్ అయిన వెంటనే దానికి సీక్వెల్ ఉంటుందంటూ మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేస్తూ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ కూడా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట. మరి ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కల్కి 2 (Kalki 2) సినిమాకి భారీ క్రేజ్ అయితే ఉంది. మరి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తుందంటూ చాలామంది సినిమా మేధావులు సైతం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
మొదటి పార్ట్ కి 400 కోట్ల బడ్జెట్ అయితే ఇప్పుడు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా సరే 2000 కోట్లు మార్కును దాటి ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో నాగ్ అశ్విన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో సెంటిమెంట్ తో పాటు ఒక ఫిలాసఫీ కూడా దాగి ఉంటుంది.
మరి కల్కి సినిమాలో సైతం ఇలాంటి ఒక ఫిలాసఫీని చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కలియుగంతంలో కల్కి ఎలా వస్తాడు, ఎలా కలిని అంతం చేస్తాడు అనే పాయింట్స్ ను ఈ సినిమాలో చూపిస్తూ నెక్స్ట్ లెవెల్ లో ఈ మూవీ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా 2027 లో సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది…