https://oktelugu.com/

Kajol: షారుఖ్​కు బర్త్​డే విషెస్​ చెప్పకపోవడంపై కాజోల్​ ఆసక్తికర కామెంట్​!

Kajol: బాలీవుడ్​లో షారుఖ్​ ఖాన్​- కాజోల్​ జోడీకున్నక్రేజ్​ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాజీఘర్​, దిల్​వాలే దుల్హానియా లేజాయేంగే, కుచ్​కుచ్​ హోతా హై, కభీ ఖుషి కభీ గమ్​, మై నేమ్​ ఈజ్​ ఖాన్​, దిల్​వాలే వంటి ఎన్నో సక్సస్​ఫుల్​ సినిమాల్లో వీరిద్దరు జంటగా నటించి స్క్రీన్​ షేర్​ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వెండితెరపై రొమాంటిక్​ జోడీగా పేరుపొందిన వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని ఒకానొక సమయంలో అందరూ అనుకున్నారు. అయితే, అవన్నీ కేవలం కల్పితాలేనని తేలింది. ఆ తర్వాత […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 4, 2021 / 03:46 PM IST
    Follow us on

    Kajol: బాలీవుడ్​లో షారుఖ్​ ఖాన్​- కాజోల్​ జోడీకున్నక్రేజ్​ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాజీఘర్​, దిల్​వాలే దుల్హానియా లేజాయేంగే, కుచ్​కుచ్​ హోతా హై, కభీ ఖుషి కభీ గమ్​, మై నేమ్​ ఈజ్​ ఖాన్​, దిల్​వాలే వంటి ఎన్నో సక్సస్​ఫుల్​ సినిమాల్లో వీరిద్దరు జంటగా నటించి స్క్రీన్​ షేర్​ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వెండితెరపై రొమాంటిక్​ జోడీగా పేరుపొందిన వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని ఒకానొక సమయంలో అందరూ అనుకున్నారు. అయితే, అవన్నీ కేవలం కల్పితాలేనని తేలింది. ఆ తర్వాత షారుఖ్​ గౌరీఖాన్​ను వివాహమాడారు. కాజోల్​ అజయ్​ దేవగణ్​ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.

    కాగా, షారుఖ్​ తనయుడు ఆర్యన్​ఖాన్​ డ్రగ్స్​ కేసులో అరెస్డైన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు మూడు వారాలు జైలులోనే గడిపి ఇటీవలే బెయిల్​పై విడుదలయ్యారు. కాగా, నవంబరు 2న బాలీవుడ్​ బాద్​షా తన 56వ పుట్టిన రోజును జరుపుకున్నారు. దీంతో పలువురు ప్రముఖులు అతని పుట్టిన రోజుకు సోషల్​ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కాజోల్​ మాత్రం ఎలాంటి విషెస్​ చెప్పలేదు. అయితే, ఇన్​స్టాగ్రామ్​లో ఆస్క్​ మీ ఎనీథింగ్​ సెషన్​ నిర్వహించిన కాజోల్​కు.. షారుఖ్​ పుట్టిన రోజున ఎందుకు విషెస్​ చెప్పలేదని ఓ అభిమాని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కాజోల్​.. ఆర్యన్​ తిరిగి రావడంతో షారుఖ్​ కలలన్నీ ఫలించాయని.. ఇంతకన్నా సంతోషకరమైన విషయం ఆయను ఏముంటుందని తనదైన స్టైల్​లో బదులిచ్చింది.