Godfather: ఒకప్పటి అందాల భామ, ఇప్పటి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్, మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె ఒక ఎమోషనల్ పాత్రలో కనిపించబోతుంది. ఈ పాత్ర చనిపోయాకే మెగాస్టార్ హీరోయిజమ్ ఎలివేట్ అవుతుందని తెలుస్తోంది. రవీనా టాండన్ అంటే నేటి ఆడియన్స్ లో కూడా ఫుల్ క్రేజ్ ఉంది.

వయసు పెరిగినా తనలోని గ్లామర్ ను పోకుండా ఇప్పటికీ పర్ఫెక్ట్ ఫిజిక్ తో మొత్తానికి తనను తానూ బాగానే మెయింటైన్ చేస్తూ వస్తోంది. కాగా రవీనా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గాడ్ ఫాదర్ సినిమా గురించి పరోక్షంగా కామెంట్స్ చేస్తూ.. ‘నేను ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాను. ఆయన సినిమాలో నటిస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది .
ఇక నా పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. దర్శకుడు కథ చెప్పిన వెంటనే ఆ సన్నివేశాలన్నీ నా ముందు కదలాడాయి. అంత అద్భుతంగా నా పాత్ర ఉండబోతుంది అంటూ మెగాస్టార్ తో పనిచేయడం అద్భుతం అని, ఆయన మంచి వ్యక్తి మాత్రమే కాదు, అద్భుతమైన నటుడు కూడా అని, ఆయనతో పనిచేసిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తూ పని చేశాను’ అని రవీనా చెప్పుకొచ్చింది.
ప్రస్తతం ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిజానికి మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లోనే ఫుల్ క్రేజ్ ఉన్న సినిమా కావడంతో ఈ చిత్రం పై చిరు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు అవ్వడం ఖాయం అంటున్నారు. ఇక ఈ సినిమాలో చిరు లుక్ మెగాస్టార్ కెరీర్ లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందట.
Also Read: మెగాస్టార్ తో ఏమి చేస్తాడు ? అప్పుడే నెగిటివ్ ప్రచారం !
కాగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి తమన్ స్వరాలందిస్తుండగా.. నిరవ్ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
Also Read: Pushpa Movie: “పుష్ప” సినిమాలో ఓ పాట కోసం ఎంతమంది డాన్స్ వేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…