Srileela : కెరీర్ లో రెండు సినిమాలు తప్ప అన్ని సినిమాలు ఫ్లాపులే, ఈ రేంజ్ ఫ్లాప్స్ వస్తే హీరోలు ఇండస్ట్రీ లో మనుగడ సాధించడమే కష్టం, అలాంటిది హీరోయిన్స్ ఉండగలరా?, ఎంతోమంది హీరోయిన్స్ తళుక్కుమని మెరిసి మాయమైపోయారో మనం ఇటీవల కాలంలో ఉదాహరణగా చూసి ఉంటాము?, కానీ ఒక హీరోయిన్ కి మాత్రం ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ ని తన బుట్టలో వేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, శ్రీలీల(Sree Leela). పెళ్లి సందడి చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన శ్రీలీల, ఆ తర్వాత ‘ధమాకా ‘ చిత్రం భారీ హిట్ ని అందుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అయ్యాయి. నటన పరంగా కూడా ఎన్నో విమర్శలు ఎదురుకుంది. మధ్యలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రం ఒక్కటే హిట్ అయ్యింది.
Also Read : తల్లి కారణంగానే శ్రీలీల సినీ కెరీర్ నాశనం అవుతుందా..?
రీసెంట్ గానే ఆమె హీరోయిన్ గా నటించిన ‘రాబిన్ హుడ్’ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె రవితేజ తో ‘మాస్ జాతర’, పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు చేస్తుంది. ఈ సినిమాల సంగతి పక్కన పెడితే ఈమధ్య కాలంలోనే ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కార్తీక్ ఆర్యన్ తో ఒక లవ్ స్టోరీ చేస్తున్న శ్రీలీల, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ మొదటి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఆమె ముంబై లోనే మకాం వేసింది. ఈ సినిమాల షూటింగ్స్ జరుగుతున్న సమయంలోనే ఆమెకు మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రాజ్ & డీకే షాహిద్ కపూర్(Shahid Kapoor) తో ‘ఫర్జీ'(Farji) అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.
అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియో లో అప్లోడ్ చేసిన అన్ని ఒరిజినల్ వెబ్ సిరీస్ల కంటే ఈ సిరీస్ కే అత్యధిక వ్యూస్ వచ్చాయి. విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, రెజీనా కాసాండ్రా ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సిరీస్ కి సీక్వెల్ తెరకెక్కించబోతున్న. ఈ సిరీస్ లో శ్రీలీల ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఇన్ని రోజులు కేవలం సినిమాలకే పరిమితమైన ఈ కుర్ర బ్యూటీ, మొట్టమొదటిసారి ఇండియా లోనే మోస్ట్ క్రేజీ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకున్న ‘ఫర్జీ’ లోకం లోకి అడుగుపెట్టబోతుంది. అయితే ఇందులో ఆమె ఎలాంటి పాత్రలో నటించబోతుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Also Read : అతనే నా జీవితం అంటున్న శ్రీలీల..ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!