https://oktelugu.com/

పెళ్లి అయినా వదట్లేదు.. వరుసగా అవకాశాలు !

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చాలా కాలంగా వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌తో ప్రేమాయణం సాగించి, మొత్తానికి 2020 అక్టోబర్ 30న అతడిని వివాహం చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. అయితే, పెళ్లి అయ్యాక కూడా వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకువెళ్తుంది కాజల్. నిజానికి ‘కాజల్ అగర్వాల్’ ఎప్పటి నుండో ఫేడ్ అవుట్ దశలో ఉంది. అయినా సినిమాలు ఇంకా కాజల్ కి వస్తూనే ఉన్నాయి. ఆ రకంగా కాజ‌ల్ కెరీర్ కు ప్రస్తుతం అంతా బోన‌స్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 4, 2021 / 10:17 AM IST
    Follow us on


    స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చాలా కాలంగా వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు‌తో ప్రేమాయణం సాగించి, మొత్తానికి 2020 అక్టోబర్ 30న అతడిని వివాహం చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. అయితే, పెళ్లి అయ్యాక కూడా వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకువెళ్తుంది కాజల్. నిజానికి ‘కాజల్ అగర్వాల్’ ఎప్పటి నుండో ఫేడ్ అవుట్ దశలో ఉంది. అయినా సినిమాలు ఇంకా కాజల్ కి వస్తూనే ఉన్నాయి. ఆ రకంగా కాజ‌ల్ కెరీర్ కు ప్రస్తుతం అంతా బోన‌స్ పిరియ‌డే అనుకోవాలి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో ఇప్పటికే ‘ముంబై సాగా, ఇండియన్ 2’, ‘ఆచార్య’ సినిమాలు ఉన్నాయి.

    Also Read: ‘ఆహా’.. ఏమైనా ఆఫరా

    చిరు, బాలయ్య, నాగ్ లాంటి ముదురు హీరోల‌కు హీరోయిన్ల కొర‌త ఉండటంతో సీనియర్ హీరోలకు జోడీగా కాజ‌ల్ కు కాలం క‌లిసి వచ్చి చాన్స్ లు క్యూ కట్టాయి. అందుకే చిరంజీవి, క‌మ‌ల్ హాస‌న్ వంటి స్టార్లు కాజ‌ల్ ను త‌ప్ప‌నిస‌రిగా తమ సినిమాలో తమ సరసన హీరోయిన్ గా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే క్ర‌మంలో ఆమె తుపాకీ సీక్వెల్ లో కూడా నటిస్తోంది. విజ‌య్ హీరోగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తుపాకీ సినిమా సీక్వెల్ లో కాజల్ ను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఇలా కాజల్ ఇలా మొత్తం నాలుగు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తోంది.

    Also Read: ఈసారి డ్రెస్ ** చూపించిన హాట్ బ్యూటీ

    అలాగే తమిళ్ స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలోనూ అలాగే విక్రమ్ సినిమాలో కూడా కాజల్ నే హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. విజయ్, సూర్య, విక్రమ్ సినిమాలలో హీరోయిన్ అంటే.. కాజల్ కి మరో నాలుగైదు ఏళ్ళు కెరీర్ ఉన్నట్లే. పైగా, ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మంచి కమర్షియల్ పొలిటికల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళీ స్టార్ మోహన్ లాల్ పాత్ర ఉందట. ఆ పాత్ర సరసన ఒక హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని.. ఆ పాత్రలోనూ కాజల్ నే తీసుకోనున్నారట. మొత్తానికి కాజల్ కి పెళ్లి అయినా హీరోలు వదట్లేదు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్