మనుషుల జీవితంలో మరణం అనేది ఎలా సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు. కొందరు ఊహించని ప్రమాదాల వల్ల చనిపోతుంటే మరికొందరు వేర్వేరు ఆరోగ్య సమస్యల వల్ల చనిపోతున్నారు. ఎంతటి ధనవంతుడైనా, ఎంత ఉన్నతస్థానంలో ఉన్నా చావును ఆపడం మాత్రం సాధ్యం కావడం లేదు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ప్రస్తుతం చావును ఆపడం సాధ్యం కాకపోయినా భవిష్యత్తులో సాధ్యమవుతుందని తెలుపుతున్నారు.
స్వయంగా జెనెటిక్ ఇంజనీర్లు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడిస్తున్నారు. ముసలివాళ్లు కూడా వయస్సును తగ్గించుకోవడం సాధ్యమవుతుందని భవిష్యత్తులో శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా అద్భుతాలు సృష్టించబోతున్నారని తెలుస్తోంది. జన్యు శాస్త్రవేత్తలు భవిష్యత్తులో ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయే వాళ్లు ఎవరూ ఉండరని.. వాహన ప్రమాదాల వల్ల మాత్రమే చనిపోయే అవకాశాలు ఉంటాయని తెలుపుతున్నారు.
ది డెత్ ఆఫ్ డెత్ అనే పుస్తంలో జోస్ లూయిస్, దేవిడ్ వుడ్ అనే శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. మానవులు అమరులవుతారని… వాళ్లంతకు వాళ్లుగా చనిపోవడం తప్ప ఇతర కారణాల వల్ల చనిపోయే అవకాశాలు ఉండవని చెబుతున్నారు. ప్రస్తుతం వృద్ధుల్లో చాలామంది కష్టతరమైన జీవనం సాగిస్తున్నారని ఈ పరిస్థితుల్లో సైతం మార్పులు వస్తాయని తెలుపుతున్నారు.
ప్రస్తుతం శాస్త్రవేత్తల పరిశోధనలు ఈ దిశగా సాగుతున్నాయి. ప్రస్తుతం కరోనా లాంటి వైరస్ ల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నా భవిష్యత్తులో మాత్రం ఎలాంటి వైరస్ లు, బ్యాక్టీరియాలు ప్రభావం చూపవని తెలుస్తోంది.