https://oktelugu.com/

కాజల్ రోమాన్స్.. ఈసారి భర్తతో.. డంగవుతున్న ఫ్యాన్స్..!

సౌత్ ఇండియాలోని అగ్ర కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. 35ఏళ్లు దాటినా 18ఏళ్ల కుర్ర హీరోయిన్ లాగే కాజల్ అగర్వాల్ హోయలుపోతూ ఉంటుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా కాజల్ అగర్వాల్ సినిమాల్లో కొనసాగుతూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకొని కొత్తజీవితంలో అడుగుపెట్టింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ కాజల్ అగర్వాల్ పెళ్లాయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పడంతో ఫ్యాన్స్ కొంత కూల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2020 / 11:30 AM IST
    Follow us on

    సౌత్ ఇండియాలోని అగ్ర కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. 35ఏళ్లు దాటినా 18ఏళ్ల కుర్ర హీరోయిన్ లాగే కాజల్ అగర్వాల్ హోయలుపోతూ ఉంటుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా కాజల్ అగర్వాల్ సినిమాల్లో కొనసాగుతూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకొని కొత్తజీవితంలో అడుగుపెట్టింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    కాజల్ అగర్వాల్ పెళ్లాయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పడంతో ఫ్యాన్స్ కొంత కూల్ అయ్యారు. అయితే కాజల్ అగర్వాల్ హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడే భర్తతో కలిసి రోమన్స్ చేస్తూ అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాజల్ ను గౌతమ్ కిచ్లు వెనుక నుంచి గట్టిగా హాగ్ చేసిన ఫొటోను షేర్ చేసింది. దీనిని చూసిన ఫ్యాన్స్ డంగై పోతున్నారు. భర్తతో ఎంజాయ్ చేస్తే చేశావుగానీ.. ఇలాంటి పిక్స్ షేర్ చేసి మా గుండెల్లో గునపాలు దింపొద్దంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: వెంకీ..రానా కాంబో.. ఫిక్సయిన ముహుర్తం..!

    వెండితెరపై హీరోలతో కాజల్ అగర్వాల్ రోమాన్స్ చేస్తే ఎంజాయ్ చేసిన అభిమానులు.. కాజల్ తన భర్తతో రోమాన్స్ చేస్తుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నారు.కాజల్ అగర్వాల్ హనీమూన్ వెళ్లడానికి ముందే తన పేరును కాజల్ కిచ్లూగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. మాల్దీవులకు వెళ్లేందుకు ప్రత్యేకంగా కపుల్ పాస్ పోర్ట్ కవర్ తయారు చేయిచుకోగా అందుల్ కాజల్ కిచ్లూ అని రాసి ఉంది.

    Also Read: బిగ్ బాస్’ చేష్టలకు కన్నీరు పెట్టుకున్న అవినాష్.. అరియానా..!

    కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లూ ప్రస్తుతం మాల్డీవుల్లోని బీచుల్లో తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లాయిన వెంటనే హనీమూన్ వెళ్లిన ఈ కొత్త జంట దీపావళికి ఇంటికి తిరిగొస్తారని సమాచారం. ఆ తర్వాత కాజల్ తన సినిమాల్లో మళ్లీ బీజీ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ‘ఆచార్య’.. ‘ఇండియన్-2’ సినిమాల్లో నటిస్తుంది.