Nisha Aggarwal Divorce: చందమామ కాజల్ అగర్వాల్ ఫ్యామిలీ గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ తెరపైకి వచ్చింది. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ భర్తతో విడిపోతున్నారట. ఆమె విడాకులు సిద్దమయ్యారన్న వార్త కలకలం రేపుతోంది. అక్క కాజల్ స్టార్ గా వెలిగిపోతున్న రోజుల్లో వారసురాలిగా నిషా అగర్వాల్ ఎంట్రీ ఇచ్చారు. ఒడ్డు పొడుగు అందంలో అక్క కాజల్ కి ఏమాత్రం తీసిపోని నిషా అగర్వాల్ ని ప్రేక్షకులు ఆదరించారు. నిషాకి మంచి ఆరంభం లభించింది. నిషా డెబ్యూ మూవీ ‘ఏమైంది ఈవేళ’ విజయాన్ని అందుకుంది. 2010లో వరుణ్ సందేశ్ హీరోగా విడుదలైన ఏమైంది ఈవేళ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా నిలిచింది.

ఆరంభమే అదిరిపోగా నారా రోహిత్-పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కిన సోలో మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. సోలో కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. నారా రోహిత్ కెరీర్లో వన్ అండ్ ఓన్లీ హిట్ సోలో కావడం విశేషం. దర్శకుడు పరశురామ్ కి సైతం సోలో మంచి బ్రేక్ ఇచ్చింది. రెండు వరుస విజయాలు అందుకున్న నిషా కోలీవుడ్ లో ఆఫర్ దక్కించుకున్నారు. ఇష్టం టైటిల్ తో ఓ మూవీ చేశారు. తెలుగులో హ్యాట్రిక్ కొట్టాలని చూసిన నిషా కోరిక తీరలేదు.
ఆది సాయి కుమార్ హీరోగా విడుదలైన సుకుమారుడు అనుకున్న స్థాయిలో ఆడలేదు. తర్వాత సరదాగా అమ్మాయితో అంటూ వరుణ్ తేజ్ తో జతకట్టింది. ఆ మూవీ వచ్చిపోయినట్లు కూడా తెలియదు. టాలీవుడ్లో ఆఫర్స్ తగ్గడంతో మాలీవుడ్ కి వెళ్లిన నిషా అక్కడ రెండు చిత్రాలు చేశారు. అక్క వలె సక్సెస్ కావడం అంత ఈజీ కాదని నిషాకు తెలిసిపోయింది. హీరోయిన్ అనే ట్యాగ్ ఉండగానే పెళ్ళికి సిద్ధమైంది. 2013లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త కరణ్ వలేచాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి కూడా ఉన్నాను.

అక్క కాజల్ కంటే ముందు పెళ్లి చేసుకున్న నిషా అగర్వాల్ విడాకులకు సిద్దమయ్యారనే వార్త కలకలం రేపుతోంది. భర్త కరణ్ తో ఆమెకు విబేధాలు వచ్చాయట. ఈ క్రమంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. నిషా-కరణ్ విడిపోతున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు తమ కథనాల్లో వెల్లడించాయి. అయితే ఈ వార్తలపై నిషా కుటుంబ సభ్యులు ఎవరూ మాట్లాడలేదు. ఈ క్రమంలో ఇది వట్టి పుకారేనా లేక నిజం ఉందా అనే సందేహాలు మొదలయ్యాయి. కరణ్ తో నిషా వివాహం జరిగిన 9 ఏళ్ళు అవుతుండగా ఇలాంటి వార్తలు వచ్చిన దాఖలాలు లేవు.