Meena hot comments on remarriage: హీరోయిన్ గా తెలుగు, తమిళం, హిందీ, ఇలా అన్ని ప్రాంతీయ భాషల్లో అగ్రహీరోల సరసన నటించి, ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకొని ఆరోజుల్లోనే పాన్ ఇండియా హీరోయిన్ అని అనిపించుకున్న నటి మీనా(Meena Sagar). ఇప్పటికీ కూడా ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ నేటి తరం ఆడియన్స్ ని కూడా అలరిస్తూ ముందుకు వెళ్తోంది. అయితే ఈమెపై ఇటీవల కాలం లో వచ్చిన రూమర్స్ మామూలివి కావు. ఈమె భర్త విద్యాసాగర్ 2022 వ సంవత్సరం లో కరోనా కారణంగా చనిపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈమె రెండవ పెళ్లి గురించి సోషల్ మీడియా లో ఎన్నో వందల రూమర్స్ వచ్చాయి. కొంతమంది అయితే తమిళ హీరో ధనుష్ ని మీనా పెళ్లాడబోతుంది, త్వరలోనే వీళ్ళ పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. మీనా ఈ వార్తలపై అప్పట్లో తీవ్ర స్థాయిలో స్పందించి ఖండించింది.
ఇక రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కూడా ఈమె రెండవ పెళ్లి రూమర్స్ పై చాలా ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో నా రెండవ పెళ్లి పై వచ్చిన రూమర్స్ చూసి చాలా దిగ్బ్రాంతికి గురయ్యాను. మానసికంగా చాలా బాధపడ్డాను. ఒక అమ్మాయి కి భర్త చనిపోయి ఒంటరిగా జీవిస్తుంటే, లేనిపోనీ లింకులు పెట్టేస్తారా ?, అసలు ఇలాంటి మనుషులు ఉన్న సమాజం లో ఉంటున్నాను అంటేనే భయం వేస్తోంది. నాకంటే అతి చిన్న వయస్సు ఉన్నవాళ్ళతో కూడా నాకు సంబంధం అంటగట్టారు. సోషల్ మీడియా లో వస్తున్న ఈ రూమర్స్ ని చూసి మా అమ్మాయి కూడా చాలా బాధపడింది’ అంటూ మీనా తన ఆవేదన వ్యక్తం చేసింది. సాధ్యమైనంత వరకు ఇలాంటి రూమర్స్ ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉన్నానని, కానీ బంధు మిత్రులు ఇది నిజమేనేమో అని అనుకోని నన్ను సంప్రదించినప్పుడు నాకు రక్తం మరిగిపోతుందని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది.
ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, మలయాళం లో మోహన్ లాల్ తో కలిసి ‘దృశ్యం 3’ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ సాధారమైనది కాదు. సమ్మర్ కానుకగా విడుదల అవ్వబోయే ఈ చిత్రం, కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. తెలుగు లో కూడా ఈ సినిమా రీమేక్ కానుంది. త్వరలోనే విక్టరీ వెంకటేష్ తో కలిసి ఈమె సెట్స్ లోకి అడుగుపెట్టబోతుంది. ఇది కాకుండా ఆమె రౌడీ బేబీ అనే తమిళ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా మలయాళం లో తెరకెక్కుతున్న సీక్రెట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటిస్తోంది. జియో హాట్ స్టార్ యాప్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.