https://oktelugu.com/

NTR Movie Cancelled: ఎన్టీఆర్ కొత్త సినిమా క్యాన్సిల్ అయ్యిందా?? ఆందోళనలో ఫాన్స్

NTR Movie Cancelled: #RRR వంటి సెన్సషనల్ హిట్ తో మంచి ఊపు మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ తో చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం ఆ సినిమా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్న కొరటాల శివ ఈ సినిమా విడుదల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 20, 2022 / 05:50 PM IST
    Follow us on

    NTR Movie Cancelled: #RRR వంటి సెన్సషనల్ హిట్ తో మంచి ఊపు మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ తో చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం ఆ సినిమా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్న కొరటాల శివ ఈ సినిమా విడుదల అయిన నెల రోజుల గ్యాప్ తర్వాత ఆయన ఎన్టీఆర్ తో సినిమాని ప్రారంభిస్తారు..ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం ని పూర్తి చేసిన కొరటాల ఫైనల్ డ్రాఫ్ట్ ని ఇటీవలే ఎన్టీఆర్ కి వినిపించగా ఆయన ఆ స్క్రిప్ట్ కి ఎంతగానో కనెక్ట్ అయినట్టు తెలుస్తుంది..ఈ సినిమా కొరటాల శివ రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగ కాకుండా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు అట..ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ మరో కొత్త సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త అభిమానులను షాక్ కి గురి చేస్తోంది.

    NTR Movie Cancelled

    అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ మరియు ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు కాంబినేషన్ లో ఒక్క సినిమా తెరకెక్కబోతుంది అనే వార్త గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతూన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ని కూడా పెట్టినట్టు వార్తలు వచ్చాయి..అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే క్యాన్సిల్ అయినట్టు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి..ఎందుకంటే ఎన్టీఆర్ త్వరలో KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అనే సంగతి మన అందరికి తెలిసిందే..ప్రభాస్ తో ఆయన చేస్తున్న సలార్ సినిమా పూర్తి అవ్వగానే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొత్తం పూర్తి అయ్యిపోయింది..అయితే కొరటాల శివ తో సినిమా పూర్తి చేసిన తర్వాత వెంటనే ప్రశాంత్ నీల్ తో చెయ్యబొయ్యే సినిమా కి షిఫ్ట్ అవ్వాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది.

    Also Read: RRR Komaram Bheem: RRR లో కొమురం భీమ్ పాత్రని వదులుకున్న హీరోలు వీళ్లేనా??

    కొరటాల శివ సినిమా పూర్తి అయిన తర్వాత ప్రశాంత్ నీల్ కాళీగా ఉంటె ముందు ఆయనతోనే సినిమా చేస్తాడట ఎన్టీఆర్..లేదా ప్రశాంత్ నీల్ అప్పటికి సలార్ మూవీ షూటింగ్ ని కొనసాగిస్తూ ఉంటె బుచ్చి బాబు తో ఆ గ్యాప్ లో బుచ్చి బాబు తో సినిమా చేస్తాడట ఎన్టీఆర్..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..పరిస్థితులు అనుకూలించకపోతే బుచ్చి బాబు సినిమా కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..మరి భవిష్యత్తులో ఏమి అవుతుందో చూడాలి ..ఇక ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకి గాను 70 రోజుల కాల్ షీట్స్ ని కేటాయించాడు అట..ఈ 70 రోజులకు గాను ఆయన సుమారుగా 55 కోట్ల రూపాయిల పారితోషికం అందుకుంటున్నట్టు సమాచారం..ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ అని చెప్పొచ్చు..#RRR సినిమాకి ముందు వరుకు కూడా ఆయన 35 కోట్ల రూపాయిల పారితోషికం మాత్రమే తీసుకునేవారు..కానీ #RRR తర్వాత తన పార్టిసోషికం ని ఏకంగా 20 కోట్ల రూపాయలకు పెంచుకున్నాడు.

    Also Read: Krithi Shetty: ‘కృతి శెట్టి’ కావాలా ? ఐతే, 3 కోట్లు ఇవ్వండి !

    Recommended Videos:

    Tags