అంతమాత్రాన కాజల్ ఒక్కదాన్నే ఎందుకు తప్పుబట్టడం అంటే.. కాజల్ చేతిలో స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ తో ఆచార్య చేస్తుంది. కమల్ హాసన్ తో సినిమా చేస్తోంది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా ఒక సినిమా చేస్తోంది. ఇన్ని భారీ ఆఫర్లు చేతిలో పెట్టుకుని.. చిన్నాచితకా సోలో సినిమాల కోసం కక్కుర్తి అవసరమా ?
అయినా హారర్ సినిమాలే చేయను అని గతంలో చాలాసార్లు చెప్పుకొని.. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా అని హారర్ జోనర్ పై పడితే ఎలా కాజల్ ?, ఇదే విషయాన్ని ఓ నెటిజన్ అడిగితే.. కాజల్ తెలివిగా సమాధానం ఇచ్చింది. ఓ నటిగా అన్ని రకాల కథలు, పాత్రలు చేయాలి కదా, అందుకే హారర్ జానర్ లో ఆ మధ్య ఓ వెబ్ సిరీస్ చేశాను.
తాజాగా మళ్ళీ ఇదే జానర్ లో ఓ సినిమా చేయబోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. విహారి అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో కాజల్ ఓ హారర్ సినిమా చేయబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలవుతుందని తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఇదే ఏడాది నవంబర్ లో ఈ సినిమాని థియేటర్లలోకి తెస్తారట.