‘ఆర్ఆర్ఆర్’ మరో సాహసం.. రాజమౌళి ధైర్యం?

ఆర్ఆర్ఆర్ నుంచి మరో అద్భుతం ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. కరోనా దెబ్బకు వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు దసరాకు విడుదల చేయడానికి రెడీ అయ్యారు. అందరూ కరోనా థర్డ్ వేవ్ భయాలతో థియేటర్లకు రావడానికి జంకుతింటే రాజమౌళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 13న సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. తెలుగుతోపాటు ప్యాన్ ఇండియా లెవల్ లో ఇండస్ట్రీ ఆశలన్నీ ఆర్ఆర్ఆర్ మూవీ మీదనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ‘ఆర్ఆర్ఆర్’ను థియేటర్లలోనే […]

Written By: NARESH, Updated On : July 29, 2021 5:06 pm
Follow us on

ఆర్ఆర్ఆర్ నుంచి మరో అద్భుతం ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. కరోనా దెబ్బకు వాయిదాల మీద వాయిదాలు పడిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు దసరాకు విడుదల చేయడానికి రెడీ అయ్యారు. అందరూ కరోనా థర్డ్ వేవ్ భయాలతో థియేటర్లకు రావడానికి జంకుతింటే రాజమౌళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 13న సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.

తెలుగుతోపాటు ప్యాన్ ఇండియా లెవల్ లో ఇండస్ట్రీ ఆశలన్నీ ఆర్ఆర్ఆర్ మూవీ మీదనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ‘ఆర్ఆర్ఆర్’ను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్టు రాజమౌళి భావిస్తున్నాడట..

ఈసారి రాజమౌళి అన్న టైంకు వస్తానని ప్రకటించాడు. ఈ మేరకు ప్రమోషన్ కూడా స్ట్రాట్ చేశాడు. ఆగస్టు1వ తేదీకి తొలి సాంగ్ ను కీరవాణి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నాడు.

ఆర్ఆర్ఆర్ మూవీ దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే అన్ని భాషల్లో పోటీలేకుండా తేదీ ప్రకటించాలి. అందుకరే రాజమౌళి ఈ విషయంలో అక్టోబర్ 13కే కట్టుబడి ఉంటాడని తెలుస్తోంది. అంతర్జాతీయంగానూ అదే టైంకు రిలీజ్ చేయడానికి జక్కన్న టీం సినిమాను రెడీ చేస్తోంది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా దీన్ని రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఇంగ్లీష్ లోనూ అనువదిస్తారు. ఆ తర్వాత వివిధ దేశాల్లో భాషలకు వారికి అమ్మేస్తారు. ఇలా అక్టోబర్ 13కు ఖచ్చితంగా విడుదల చేయడానికి రాజమౌళి రెడీ అయ్యారు. థర్డ్ వేవ్ వచ్చినా వెనక్కి తగ్గేది మొండిగా ముందుకెళుతున్నాడు.