Kajal Aggarwal: చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పంజాబీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగుతో పాటు తమిళంలోనూ దాదాపు పదేండ్లకు పైగా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. దాదాపు అందరు స్టార్, ఆవరేజ్ హీరోలతో నటించి మెప్పించింది. ఇప్పుడు సీనియర్ హీరోల సరసన కూడా స్టెప్పులేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
కాగా ఆమె తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని వైవాహిత జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ జంట ఓ తీపి కబురు చెప్పింది. కాజల్, కిచ్లూ జంట త్వరలోనే మొదటి బిడ్డకు వెల్ కమ్ చెప్పబోతున్నారు. ఇక ఈ వార్త తెలుసుకున్న కాజల్ అభిమానులు తెగ సంబుర పడిపోతున్నారు. ఇక కాజల్ బేబీ బంప్ ఫొటోలు నెట్టింట్లో ఎంతలా చెక్కర్లు కొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Also Read: ఆ విషయంలో నాకు శ్రీదేవే స్ఫూర్తి – ఆలియా భట్
ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా సరే విపరీతంగా వైరల్ అయిపోతున్నారు. అయితే తాజాగా కాజల్‌కు సీమంతం జరిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఈ వేడకలో సింధూరం కలర్ చీరలో కాజల్ మెరిసిపోయింది. ఇక ఆమె భర్త కిచ్లూ కూడా కుర్తా-పైజామా వేసుకుని సాంప్రదాయబద్ధంగా రెడీ అయిపోయారు.
వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, అలాగే కుటుంబ సమేతంగా దిగిన సీమంతం ఫొటోలు చూడ ముచ్చటగా ఉంటున్నాయి. ఇక కాజల్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని తెలిపింది. ఇప్పటికే తెలుగులో ఆమె నటించిన ఆచార్య రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే దుల్కర్ సల్మాన్తోనూ నటిస్తోంది కాజల్. ప్రస్తుతం ఆమె ఇంటి వద్దే ఉంటున్నట్టు తెలుస్తోంది.
Also Read: ‘భీమ్లా నాయక్’ టికెట్స్ బుకింగ్ షాకింగ్ నిర్ణయం
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Kajal aggarwal shares her baby shower pics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com