Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ నటనకు గుడ్ బై చెబుతున్నారట. ఆమె ఇక సినిమాల్లో నటించరట. ఇందుకు బలమైన కారణం ఉందట. కాజల్ రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం కలిగి ఉంది. లక్ష్మీ కళ్యాణం మూవీతో హీరోయిన్ గా మారిన కాజల్ ని చందమామ, మగధీర చిత్రాలు స్టార్ చేశాయి. ఇన్నేళ్ల కెరీర్లో ఆమె వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విరివిగా చిత్రాలు చేశారు. ముఖ్యంగా తెలుగులో తిరుగులేని స్టార్డమ్ అనుభవించారు. రెండు తరాల టాప్ స్టార్స్ తో ఆమె నటించారు.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే కాజల్ వివాహం చేసుకుంది. 2020 అక్టోబర్ నెలలో కాజల్ వివాహం జరిగింది. గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు వేసింది. వ్యాపారవేత్త అయిన గౌతమ్ కాజల్ ఫ్యామిలీ ఫ్రెండ్. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన వెంటనే ఆలస్యం చేయకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో కాజల్ కి పండంటి మగబిడ్డ పుట్టాడు. కాజల్ కొడుకు పేరు నీల్ కిచ్లు.
కొంచెం గ్యాప్ తీసుకున్న కాజల్ తిరిగి మరలా బిజీ అయ్యారు. భారతీయుడు 2, భగవంత్ కేసరి చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఆమెను ఇంకా క్రేజీ ఆఫర్స్ వరిస్తున్నాయి. అయితే కాజల్ నటనకు స్వస్తి పలకాలని అనుకుంటున్నారట. ఇకపై కొత్త ప్రాజెక్ట్స్ కి ఆమె సైన్ చేయరట. ఇందుకు కారణం ఆమె రెండోసారి తల్లి అయ్యిందంటున్నారు.
రెండోసారి గర్భం దాల్చిన కాజల్ ఫ్యామిలీకి సమయం కేటాయించాలని అనుకుంటున్నారట. ప్రొఫెషన్ లో ఉంటే తన పిల్లలను చూసుకునే సమయం దొరకదు. ఎలాగూ ప్రెగ్నెన్సీ కాబట్టి, నటించడానికి వీలుండదు. డెలివరీ తర్వాత ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకొని, వాళ్ళను పెంచి పెద్ద చేయాలని అనుకుంటున్నారట. పిల్లల ఆలనా పాలనా కంటే ఏదీ ముఖ్యం కాదనే నిర్ణయానికి కాజల్ వచ్చారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ పరిశ్రమలో వినిపిస్తుంది.