https://oktelugu.com/

Kajal Aggarwal: సుఖ ప్ర‌స‌వం కోసం కాజల్ స్పెషల్ వర్కౌట్స్

kajal aggarwal: మాతృత్వంలో నిస్వార్ధ ప్రేమ ఉంటుంది, అందాల తార అయినా, అచ్చతెలుగు ఇల్లాలు అయినా అమ్మతనానికి అందరూ అభిమానులే. అంత గొప్పది తల్లిప్రేమ. అందుకే, తల్లి తనాన్ని ఏ సర్వేతో కొలవలేం, ఏ పదాలతో పోల్చలేం, అందుకే, దేశానికీ రాజు అయినా, తల్లికి బిడ్డే అన్నారు. ఇక ఆ బిడ్డ కడుపులో ఉండగానే తల్లి ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆ పనిలోనే ఉంది చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : February 28, 2022 / 06:30 PM IST
    Follow us on

    kajal aggarwal: మాతృత్వంలో నిస్వార్ధ ప్రేమ ఉంటుంది, అందాల తార అయినా, అచ్చతెలుగు ఇల్లాలు అయినా అమ్మతనానికి అందరూ అభిమానులే. అంత గొప్పది తల్లిప్రేమ. అందుకే, తల్లి తనాన్ని ఏ సర్వేతో కొలవలేం, ఏ పదాలతో పోల్చలేం, అందుకే, దేశానికీ రాజు అయినా, తల్లికి బిడ్డే అన్నారు. ఇక ఆ బిడ్డ కడుపులో ఉండగానే తల్లి ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది.

    Kajal Aggarwal

    ప్రస్తుతం ఆ పనిలోనే ఉంది చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ గర్భవతి. ఐతే, కాజ‌ల్ సుఖ ప్ర‌స‌వం కోసం అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వేళ ఎలాంటి ఎక్సర్‌ సైజ్‌ లు చేయాలో వాటిని తూచా తప్పకుండా చేస్తోంది. పైగా ఓ ప్రత్యేక ట్రైన‌ర్ స‌మ‌క్షంలో ఈ క‌స‌ర‌త్తులు చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

    పైగా ఈ వీడియోకు ఓ మెసేజ్ కూడా పెట్టింది. ‘తానెప్పుడూ వ‌ర్కౌట్ చేస్తూనే ఉంటాను అని, అయితే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో మాత్రం వర్కౌట్స్ కాస్త భిన్నంగా ఉంటాయని.. అయితే, ఎటువంటి స‌మ‌స్య‌లు లేని గ‌ర్భిణులు అందరూ ‘ఎరోబిక్‌, స్ట్రెంత్ ఎక్స‌ర్‌సైజ్‌లు’ చేయాల‌ని కాజల్ తన ఇన్‌స్టా వీడియోలో సూచించింది. ఇక కాజల్ బేబీ బంప్ తో చేస్తున్న ఎక్స‌ర్‌సైజ్‌ లు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

    మొత్తానికి ప్రెగ్నెన్సీ వేళ హెల్తీ లైఫ్ స్ట‌యిల్ కోసం ఇలాంటి డిఫరెంట్ ఫిట్‌నెస్ లు వర్కౌట్స్ తో కాజల్ అగర్వాల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. పనిలో పనిగా ఇక తాను ఏమి చేసినా తన బిడ్డ కోసమే అంటూ కాజల్ కాస్త ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చింది. మరి త్వరలో మాతృమూర్తిగా మారబోతున్న ఈ అందాల చందమామకు ప్రత్యేక శుభాకాంక్షలు.

    Tags