షాకింగ్: గుండె జబ్బులున్న వారి ప్రాణాలు తీస్తోన్న కరోనా!

చైనా దేశం నుంచి భారత్ కు వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శాస్త్రవేత్తల అధయనంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనంలో గుండె జబ్బులతో బాధ పడే వారు వైరస్ భారీన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. మ్యాగ్నా గ్రేషియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి కరోనాకు గుండె జబ్బులకు సంబంధం ఉందని తేల్చారు. Also Read: కారును బైకులా మార్చి […]

Written By: Kusuma Aggunna, Updated On : August 16, 2020 7:11 pm
Follow us on

చైనా దేశం నుంచి భారత్ కు వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శాస్త్రవేత్తల అధయనంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనంలో గుండె జబ్బులతో బాధ పడే వారు వైరస్ భారీన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. మ్యాగ్నా గ్రేషియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి కరోనాకు గుండె జబ్బులకు సంబంధం ఉందని తేల్చారు.

Also Read: కారును బైకులా మార్చి ప్రాణాలు దక్కించుకున్నాడు!

ఆసియా, ఐరోపా, అమెరికా దేశాలకు చెందిన 77,317 మంది కరోనా బాధితులకు సంబంధించిన డేటాను విశ్లేషించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. కరోనా సోకిన వారిలో 12.89 శాతం మందికి ఆస్పత్రిలో చేరకముందే గుండె జబ్బులు ఉన్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. గుండె సమస్యలు లేదా గుండె రుగ్మతలతో కరోనా మరణాలకు సంబంధం ఉందని పరిశోధనల్లో తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Also Read: చెట్టును నరకడం ఇష్టం లేకా ఆ వ్యక్తి ఏం చేశాడంటే?

మిగిలిన వారిలో 36.08 శాతం మంది బీపీ సమస్యతో బాధ పడుతున్నారని… 19.45 శాతం మంది డయాబెటిస్ సమస్యతో బాధ పడుతున్నారని… కరోనా రోగుల గుండె కొట్టుకునే వేగంలో సైతం మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. కరోనా బాధితుల్లో చాలామందిలో స్వల్ప అస్వస్థత కనిపిస్తోందని… కొంతమందిలో మాత్రం వైరస్ తీవ్ర న్యూమోనియాగా మారి మరణం సంభవిస్తుందని చెప్పారు.