Ajay Bhupati: వాలి సుగ్రీవులు ఇద్దరూ భయంకరమైన బలపరాక్రమాలు ఉన్నవారే. భీకరమైన శరీర బాలలతో ఉన్నతమైన యుద్ధం చేయగలిగే వారే. కానీ ‘వాలి’లో మితిమీరిన ఆవేశం, అతివిశ్వాసం ఉన్నాయి. దాంతో ఒక్క చిన్న బాణానికే చనిపోయాడు. అందుకే ఎంత గొప్పవారికైనా సరే మితిమీరిన ఆవేశం, అతివిశ్వాసం పనికిరాదు. అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. తనకు నిజంగానే అమితమైన బలం ఉండి ఉండొచ్చు. కానీ, తన బలం పట్ల మితిమీరిన నమ్మకం ఉంటే.. ఆ బలం తన శక్తిని కోల్పోతుంది. ఇదంతా అజయ్ భూపతి అనే దర్శకుడు గురించే.

‘ఆర్.ఎక్స్.100’ అనే చిన్న సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఆ సినిమా ఎందుకు హిట్ అయింది అంటే.. అది తన క్రియేటివిటీ అని బలంగా చాటి చెప్పుకున్నాడు. అనవసరమైన బిల్డప్ మాటలు మాట్లాడి ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. హిట్ ఉంది కాబట్టి… అజయ్ భూపతికి అవకాశాలు వచ్చాయి. ఆ ఛాన్స్ లు చూసుకుని రెండో సినిమా విషయంలో అతి చూపించాడు.
సినిమాలో అతి చూపించి ఉంటే పర్వాలేదు, ఇంటర్వ్యూల్లో కూడా అతి చూపించాడు. సరిగ్గా నాలుగు లైన్లు తప్పులు లేకుండా రాయడం రాదు అని అతని గురించి ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఆ టాక్ ను నిజం చేస్తూనే.. మహాసముద్రం అంటూ పెద్ద ప్లాప్ తీసాడు. హిట్ వచినప్పుడు ఆచి తూచి అడుగులు వేయాలి. ఒకే కథ పట్టుకుని హీరోల చుట్టూ తిరిగడమే తప్పు.
అలాంటిది.. తన కథ ఒప్పుకోలేదు అని రవితేజను చీటర్ అని పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అజయ్ కి ప్లాప్ రాగానే అవకాశాలు ఇస్తాం అని పిలిచిన వాళ్లే వెయిటింగ్ లిస్ట్ లో పెడుతున్నారు. కొంతమంది అయితే మొహం మీదే నో చెప్పేస్తున్నారు. ‘నీకు అంత సీన్ లేదమ్మా.. నువ్వు ఓవర్ చేస్తావ్.. అసలు నా సినిమాలకు నిన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గానే పెట్టుకొను. ఇక డైరెక్టర్ గా ఎలా పెట్టుకుంటాను ?’ అంటూ ఓ నిర్మాత కామెంట్స్ చేశాడట.
అజయ్ రెండో సినిమా `మహా సముద్రం విడుదలకు ముందు ఈ సినిమా బ్లాక్ బ్లస్టర్ అనే కాన్ఫిడెన్స్ జనాలకు కూడా కలిగింది. పైగా అజయ్ మాటలు చూసి ఇక కచ్చితంగా `మహా సముద్రం` సునామీలా బాక్సాఫీస్ మీద విరుచుకుపడుతుంది అనుకున్నారు. కానీ… `మహా సముద్రం కాదు కదా, అల కూడా బాక్సాఫీస్ తీరాన్ని దాటలేక చేతులెత్తేసింది.
Also Read: Bujji Ila Ra Movie: బుజ్జి ఇలా రా తో ప్రేక్షకుల్ని భయపెట్టబోతున్న… సునీల్ ,ధన్‌రాజ్
`మహా సముద్రం` ప్లాప్ దెబ్బకు సెట్స్ పై వెళాల్సిన అజయ్ తర్వాత సినిమా కూడా ఆగిపోయింది. నిర్మాత అనిల్ సుంకర అజయ్ భూపతితో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. తమిళ హీరో ధనుష్ కి కథ చెప్పించాడు. ఐతే, ధనుష్ మాత్రం `మహా సముద్రం` రిలీజ్ అయ్యాక నిర్ణయం చెబుతా అన్నాడు. సినిమా ఫ్లాప్ అయ్యింది కాబట్టి.. ఇక ధనుష్ సినిమా పై ఇక ఆశలు ఆవిరైనట్టే. మొత్తానికి అజయ్ భూపతి అతి చేసి స్థితి కోల్పోయాడు.
Also Read: Actor Shankar Rao: చిత్ర పరిశ్రమలో విషాదం… ప్రముఖ నటుడు కన్నుమూత