https://oktelugu.com/

Hyderabad : హైదరాబాదులో చీప్ ఇల్లు కావాలా.. అయితే ఈ ప్రాంతానికి వెళ్లండి?

చాలా మందికి ఎఫ్టీఎల్ పరిధిలోని ఇళ్లు కొనుగోలు చేశామని తెలియక చివరకు లాస్ అయ్యారు. దాంతో ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా చతికిలపడింది. దాంతో ప్రజలు సేఫ్టీ వైపు ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఎఫ్టీఎల్ జోన్ లేని ఏరియాలను అన్వేషిస్తున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 5, 2024 6:21 pm
    Hyderabad

    Hyderabad

    Follow us on

    Hyderabad :  కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాను తీసుకొచ్చింది. అక్రమ కట్టడాలను, అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు రేవంత్ హైడ్రాను తీసుకొచ్చారు. దాంతో అప్పటి నుంచి హైడ్రా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తోంది. అలా చాలా వరకు కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఇళ్లు నేలమట్టం అయ్యాయి. చాలా మందికి ఎఫ్టీఎల్ పరిధిలోని ఇళ్లు కొనుగోలు చేశామని తెలియక చివరకు లాస్ అయ్యారు. దాంతో ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా చతికిలపడింది. దాంతో ప్రజలు సేఫ్టీ వైపు ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఎఫ్టీఎల్ జోన్ లేని ఏరియాలను అన్వేషిస్తున్నారు.

    అయితే.. బడా ప్రాజెక్టులపైనా హైడ్రా ఎఫెక్ట్ చాలా వరకు ఉంది. ఎవరు కూడా ఇప్పుడు ఆస్తులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు సైతం ప్రజలను మోసం చేయడంతో ప్రజలు ఎవ్వరినీ నమ్మడం లేదు. దాంతో అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగడం లేదు. రిజిస్ట్రేషన్లు కూడా ఎక్కువ సంఖ్యలో జరగడం లేదు. దాంతో రియల్ వ్యాపారులు కూడా గగ్గోలు పెడుతున్నారు. హైడ్రా వల్ల తమకు పెద్ద ఎత్తున లాస్ వస్తోందని వ్యాపారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు.. హైదరాబాద్ నగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. దాంతో ఇక్కడికి వలసలు కూడా చాలా వరకు పెరుగుతున్నాయి. అటు కరీంనగర్ వాసులకు కూడా అదే దారి కావడంతో అటు ఉండేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

    దాంతో ఇళ్ల కోసం ఇక్కడ డిమాండ్ పెరిగింది. హైడ్రా ఎఫెక్టుతోపాటు వడ్డీరేట్ల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి కొంపల్లి మంచి ఏరియా అని తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజల ఆశలు నెరవేర్చేలా అక్కడ ఇళ్లు అందుబాటులో ఉండడమే కాకుండా.. ధరలు కూడా అనువుగా ఉన్నాయి. సికింద్రాబాద్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో ఇళ్ల ధరలు మధ్యతరగతి వారికి అందకుండా పోయాయి. అందుకే ఇప్పుడు చాలా వరకు జనాలు కొంపల్లి వైపు చూస్తున్నారు. నాగ్‌పూర్ జాతీయ రహదారి, కరీంనగర్ రహదారి చుట్టుపక్కల జోరుగా పెద్ద పెద్దగా ప్రాజెక్టులు కడుతున్నారు. సుచిత్ర, కొంపల్లి, బొల్లారం ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. అటు ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు సైతం నిర్మాణం జరుగుతున్నాయి. ఓపెన్ ప్లాట్లు వెంచర్లు మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల వెలుస్తుండడం కనిపిస్తోంది. మరోవైపు.. కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ రూ.60లక్షల నుంచి మొదలుకొని రూ.80 లక్షల వరకు మాత్రమే పలుకుతోంది. ఇంకా కాస్త లగ్గరీగా కావాలనుకుంటే కోటి లోపే దొరుకుతున్నాయి. కోటి వరకు పెడితే ఇండిపెండెంట్‌లో లగ్జరీ ఇల్లు దొరుకుతున్నాయి. అయితే.. ఇటీవల కొంపల్లి నుంచి ఐటీ కారిడార్ సహా అనేక ప్రాంతాలకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సైతం మెరుగుపడింది. అందుకే.. జనాలు సైతం ఈ ఏరియాకే వచ్చేందుకు ఇష్టపడుతున్నారు. ఇటు సైడ్ డిమాండ్ కూడా ఎక్కువగా కనిపిస్తోంది.