K Ramp Collection Day 5: ఈ ఏడాది సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలే ఎక్కువ ఉన్నాయి. వాటిల్లో రీసెంట్ గా విడుదలైన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘K ర్యాంప్'(K Ramp Movie) చిత్రం కూడా ఒకటి. విడుదల రోజున ఈ సినిమాకు జరిగినంత నెగిటివ్ ప్రచారం ఏ సినిమాకు కూడా జరగలేదు. డిజాస్టర్ రేంజ్ లో రివ్యూస్ ఇచ్చారు. ఆ రివ్యూస్ తాలూకా ప్రభావం ఓపెనింగ్స్ పై పడింది. కానీ రెండవ రోజు నుండి ఈ సినిమా కుమ్మిన కుమ్ముడుకు తల పండిన ట్రేడ్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టారు. ఈ రేంజ్ లో ఒక సినిమా సర్ప్రైజ్ చేయడం ఈమధ్య కాలం లో చూడలేదని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు పోటీ గా మూడు సినిమాలు వచ్చాయి. ఆ మూడు సినిమాలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ‘K ర్యాంప్’ కంటే ఆ మూడు సినిమాలకే ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
థియేటర్స్ కూడా అత్యధిక శాతం ఆ మూడు సినిమాలకే దక్కాయి. కానీ రెండవ రోజు నుండి ‘K ర్యాంప్’ చిత్రం ఆ మూడు సినిమాలను డామినేట్ చేస్తూ ప్రభంజనం సృష్టించింది. కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుకి అతి దగ్గరగా వచ్చి కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో క్లీన్ హిట్ గా నిలబడబోతోంది ఈ చిత్రం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 5వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 62 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ముందు రోజుతో పోలిస్తే దాదాపుగా 60 శాతం హోల్డ్ ఉంది అన్నమాట. ఒక సినిమాకు లాంగ్ రన్ ఉంటుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే ఒక్క నైజాం ప్రాంతం నుండే ఈ చిత్రం 2 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అట.
అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి ఈ చిత్రం 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీకెండ్ కూడా ఈ ప్రాంతాల్లో డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇప్పటి వరకు 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అట . ఓవరాల్ గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందట. ఇక బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి కేవలం 95 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. ఈరోజు,రేపు వచ్చే వసూళ్లతో ఆ మార్కుని అందుకొని కిరణ్ అబ్బవరం కెరీర్ లో క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకోబోతోంది ఈ చిత్రం.