K Ramp Collection Day 11: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరో గా నటించిన ‘K ర్యాంప్'(K Ramo Movie) చిత్రం రీసెంట్ గానే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ట్రేడ్ ని సర్ప్రైజ్ కి గురి చేసే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు ‘K ర్యాంప్’ తో పాటు విడుదలయ్యాయి. ఆ మూడు సినిమాలను డామినేట్ చేసి మరీ ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యిందంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆడియన్స్ ఏ రేంజ్ లో ఈ సినిమాని ఎంజాయ్ చేశారు అనేది. నిన్న గాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న ఈ చిత్రం అప్పుడే 11 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 11 రోజుల్లో ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది?, ఎంత లాభాలు వచ్చాయి అనేది వివరంగా చూద్దాం. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయలకు జరిగింది.
Also Read: చిరంజీవి తో కలిసి నటించడం పై ప్రభాస్ హీరోయిన్ హాట్ కామెంట్స్..మండిపడుతున్న ఫ్యాన్స్!
ట్రేడ్ అందిస్తున్న లెక్క ప్రకారం చూస్తే 11 రోజుల్లో దాదాపుగా ఈ చిత్రానికి 12 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి 3 కోట్ల 90 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. ప్రాంతాల వారీగా చూస్తే ఒక్క నైజాం నుండే ఈ చిత్రానికి 3 కోట్ల 92 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. కిరణ్ అబ్బవరం గత చిత్రానికి వరల్డ్ వైడ్ మొత్తం కలిపి కూడా ఇందులో సగం రాలేదు. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో కోటి 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో 4 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వచ్చినట్టు సమాచారం. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకు విడుదలకు ముందు 6 కోట్ల 25 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే, 11 రోజుల్లో 10 కోట్ల 50 లక్షలు వచ్చాయి.
ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలకు కలిపి కోటి 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ నుండి కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 12 కోట్ల 90 లక్షలు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ లో తుఫాన్ ప్రభావం కారణంగా అన్ని ప్రాంతాల్లోనూ వసూళ్లు బాగా తగ్గిపోయాయి. లేదంటే ఈ చిత్రం మరో మూడు కోట్ల షేర్ ని రాబట్టి ఉండేదని అంటున్నారు. ఇప్పటికీ కూడా వీకెండ్ లో డీసెంట్ స్థాయి రన్ ని సొంతం చేసుకుంటే 15 కోట్ల షేర్ మార్క్ కి ఈ చిత్రం దగ్గరగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.