Dude Collection Day 12: ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డ్యూడ్'(Dude Movie) రీసెంట్ గానే దీపావళి సందర్భంగా భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ తో ముందుకు పోతోంది. సినిమా విడుదలై 12 రోజులు పూర్తి అయ్యింది. ట్రేడ్ వర్గాలు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ 12 రోజుల్లో తెలుగు,తమిళ భాషలకు కలిపి 107 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా రెండు భాషలకు కలిపి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ నెంబర్ ని 88 శాతం రీచ్ అయ్యిందని అంటున్నారు. డివైడ్ టాక్ తో ఒక సినిమాకు ఈ రేంజ్ రీకవరీ అనేది చిన్న విషయం కాదు. ప్రదీప్ రంగనాథన్ కి యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ కి ఇదొక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. అయితే ప్రాంతాల వారీగా ఈ సినిమాకు ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
Also Read: చిరంజీవి తో కలిసి నటించడం పై ప్రభాస్ హీరోయిన్ హాట్ కామెంట్స్..మండిపడుతున్న ఫ్యాన్స్!
తమిళనాడు లో ఈ చిత్రానికి 12 రోజుల్లో 52 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 17 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు లో K ర్యాంప్ చిత్రానికి డ్యూడ్ కంటే మంచి పాజిటివ్ టాక్ రావడం వల్ల, కలెక్షన్స్ మీద కాస్త ప్రభావం చూపించాయని, లేదంటే ఇంకో పది కోట్ల గ్రాస్ ఎక్కువ వచ్చి ఉండేదని అంటున్నారు. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక లో ఈ చిత్రం 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలకు కలిపి మరో 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఓవర్సీస్ నుండి 27 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 107 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 53 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 60 కోట్లకు జరిగింది. మరో 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుంది. కానీ బ్రేక్ ఈవెన్ కష్టమే అని అనిపిస్తోంది. ఎందుకంటే దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ గ్రాస్ వసూళ్లు రావడం తగ్గిపోయాయి. 8 వ రోజు నుండి 12 వ రోజు వరకు 8 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే రోజుకి రెండు కోట్ల గ్రాస్ వస్తుంది అన్నమాట. ఈ వీకెండ్ ఎంత వరకు నిలబడుతుంది అనేది దానిపైనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.