https://oktelugu.com/

Junior NTR: సందీప్ రెడ్డి వంగతో జూనియర్ ఎన్టీఆర్..’దేవర’ విడుదలకు ముందే అభిమానులకు విజువల్ ఫీస్ట్ వచ్చేస్తుంది!

ఆరేళ్ళ తర్వాత తమ హీరో నుండి విడుదల అవుతున్న సోలో హీరో సినిమా కావడంతో వాళ్ళ ఆకలికి తగ్గట్టుగానే రికార్డ్స్ ని వేటాడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదలకు ముందే అభిమానులకు మరో విజువల్ ఫీస్ట్ కళ్ళ ముందుకు రాబోతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 9, 2024 / 03:04 PM IST

    Junior NTR

    Follow us on

    Junior NTR: టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన ‘దేవర’ మేనియా నే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఒక్క నార్త్ అమెరికా ప్రాంతం నుండే ఈ సినిమాకి 25 వేల టిక్కెట్లు అమ్ముడుపోగా, 8 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రేపు సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ ట్రైలర్ తో అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా ప్రీమియర్స్ కి 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్కుని కూడా దాటేస్తుందని అంటున్నారు. విడుదలకు ముందే దేవర పెడుతున్న ఈ రికార్డ్స్ ని చూసి ఎన్టీఆర్ అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు.

    ఆరేళ్ళ తర్వాత తమ హీరో నుండి విడుదల అవుతున్న సోలో హీరో సినిమా కావడంతో వాళ్ళ ఆకలికి తగ్గట్టుగానే రికార్డ్స్ ని వేటాడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదలకు ముందే అభిమానులకు మరో విజువల్ ఫీస్ట్ కళ్ళ ముందుకు రాబోతుంది. రీసెంట్ గానే డైరెక్టర్ సందీప్ వంగ, జూనియర్ ఎన్టీఆర్ తో ‘దేవర’ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేసాడట. ఈ ఇంటర్వ్యూ ని మూవీ టీం అతి త్వరలోనే విడుదల చేయబోతుంది. సందీప్ వంగ సాధారణంగా ఇలాంటి ఇంటర్వూస్ రాజమౌళి కి మాత్రమే చేస్తుంటాడు. గతంలో #RRR చిత్రానికి కూడా ఆయన ఇలాంటి ఇంటర్వ్యూనే రాజమౌళి తో చేసాడు. అది చాలా వైరల్ అయ్యింది. ఇప్పుడు దేవర చిత్రం కోసం చేసాడు. ఈ సినిమా కూడా #RRR లాగానే పెద్ద హిట్ అవుతుందని , సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వ్యూ వరకు ఓకే, కానీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్ అవుతుంది అని సోషల్ మీడియా లో అభిమానులు అడుగుతున్న ప్రశ్న. రీసెంట్ గా ఒక బాలీవుడ్ పాపులర్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సందీప్ వంగ, ప్రస్తుతం తానూ ‘ఎనిమల్ పార్క్’ మూవీ షూటింగ్ కి సిద్ధం అవుతున్నానని, ఆ తర్వాత ప్రభాస్ తో ‘స్పిరిట్’ చిత్రం మొదలు అవుతుందని, ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక అల్లు అర్జున్ తో ఒక సినిమా ఉంటుందని.

    ఈ మూడు సినిమాలకు 5 ఏళ్ళ సమయం పడుతుంది కాబట్టి, ఇప్పట్లో మరో హీరోతో సినిమా చేసే అవకాశం లేదని అన్నాడు. అంటే ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే 5 తర్వాతనే ఆలోచిస్తాడు అన్నమాట. ఇది అభిమానులకు ఒక రకంగా నిరాశ కలిగించే విషయమే, సినిమా ఎలాగో రాదు కాబట్టి, కనీసం ఇలా ఇంటర్వ్యూ లో ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసి సంతోషించొచ్చు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ ఇంటర్వ్యూ అప్లోడ్ అయ్యే అవకాశం ఉంది, ఈ నెల మొత్తం ఎన్టీఆర్ యాక్టీవ్ గా ప్రొమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు.