https://oktelugu.com/

Vijay: తెలుగు ప్రేక్షకులు దళపతి విజయ్ ను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్లకంటు ఒక మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకోవాలని చూస్తారు. ఇక కొందరికి ఇక్కడ మంచి గుర్తింపు లభిస్తే మరికొందరికి మాత్రం అసలు సక్సెసులే ఉండవు...

Written By:
  • Gopi
  • , Updated On : September 9, 2024 / 02:57 PM IST

    Vijay

    Follow us on

    Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్న హీరో విజయ్… ప్రస్తుతం విజయ్ తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తూనే తమిళనాడులో ఒక కొత్త రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు.అలాగే రాజకీయ ప్రవేశం కూడా చేశాడ. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ‘గోట్ ‘ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఇక వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నప్పటికీ వాటిని అందుకోవడం లో ఈ సినిమా వెనకబడిపోయిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా పరిశ్రమను పక్కన పెడితే తెలుగులో ఆయన చాలావరకు సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నప్పటికీ ఆయనకు ఒక్క సినిమా కూడా సక్సెస్ అయితే దక్కడం లేదు. ఇక మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన తుపాకీ సినిమా కొంత వరకు పర్లేదు అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమా లేవీ కమర్షియల్ గా సక్సెస్ లను సాధించలేకపోయాయి. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయనకు ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. నిజంగా ఆయనను తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు ఆయన సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    ఇక సూర్య, విక్రమ్, కార్తీ లాంటి హీరోలు స్టార్ హీరోలుగా మారడమే కాకుండా తెలుగులో కూడా భారీ మార్కెట్ ను అయితే సంపాదించుకున్నారు. కానీ విజయ్ కి మాత్రమే ఇక్కడ ఎలాంటి సక్సెస్ దక్కడం లేదు. ఇక మొత్తానికైతే తెలుగు సినిమా దర్శకుడు అయిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు ‘ అనే సినిమా చేసినప్పటికీ ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

    ఇక తెలుగు ప్రేక్షకులు విజయ్ సినిమాలను చూడడానికి కూడా ఇష్టపడడం లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలో విజయ్ ఇక సినిమాలకి పులిస్టాప్ పెట్టి రాజకీయాల వైపు వెళ్తున్న క్రమంలో తెలుగులో ఆయన సాధించిన సక్సెస్ లు కూడా ఏమీ లేవు. కాబట్టి తెలుగులో ఆయన ఫెయిల్యూర్ హీరో గానే మిగిలిపోయాడనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

    ఇక గోట్ సినిమాతో భారీ సక్సెస్ ను సంపాదించుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా సక్సెస్ అవ్వలేదు. ఇక మొత్తానికైతే ఆయన తెలుగులో స్టార్ హీరోగా వెలుగొందాలనే ఆశ మాత్రం లేకపోయిందనే చెప్పాలి…చూడాలి మరి ఆయన ఫుల్ టైమ్ రాజకీయాల్లో కొనసాగుతాడా లేదంటే మధ్యలో సినిమాలు చేసుకుంటూ రాజకీయాల్లో కొనసాగుతాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…