https://oktelugu.com/

Jayam Ravi Divorce: 15 ఏళ్ల బంధానికి ముగింపు… విడాకుల ప్రకటన చేసిన స్టార్ హీరో

హీరో జయం రవి 15 ఏళ్ల బంధానికి ముగింపులు పలికారు. భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.

Written By:
  • S Reddy
  • , Updated On : September 9, 2024 / 03:18 PM IST

    Jayam Ravi Divorce

    Follow us on

    Jayam Ravi Divorce: కోలీవుడ్ స్టార్ హీరోల్లో జయం రవి ఒకరు. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టారు. 2003లో జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం చిత్రానికి అధికారిక రీమేక్. తమిళ్ లో సైతం జయం మూవీ భారీ విజయం అందుకుంది. దాంతో జయం రవికి మంచి ఆరంభం లభించింది. కోలీవుడ్ లో హీరోగా జయం రవి ఒక స్థాయికి వెళ్లారు.

    దర్శకుడు మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలలో జయం రవి ఒక హీరోగా నటించారు. విక్రమ్, కార్తీ ఇతర ప్రధాన పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. జయం రవికి తెలుగులో కూడా కొంత మార్కెట్ ఉంది. జయం రవి 2009లో ఆర్తిని వివాహం చేసుకున్నారు. ప్రముఖ బుల్లితెర నిర్మాత సుజాత విజయ్ కుమార్ కుమార్తె ఆర్తి. వీరిది ప్రేమ వివాహం అని సమాచారం.

    జయం రవికి ఇద్దరు కుమారులు. వారిలో ఒక అబ్బాయి పేరు ఆరవ్. జయం రవి హీరోగా తెరకెక్కిన టిక్ టిక్ టిక్ మూవీలో ఆరవ్ ఓ పాత్ర చేశాడు. కాగా జయం రవి భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో సుదీర్ఘ సందేశం రాసుకొచ్చారు. జీవితం అనేది అనేక అధ్యాయాల ప్రయాణం. ఆర్తితో విడిపోతున్న విషయం చెప్పాలంటే బాధగా ఉంది. మా వ్యక్తిగత గోప్యతను గౌరవించి, అర్థం చేసుకోవాలని కాంక్షిస్తున్నట్లు ఆయన సందేశంలో ఎమోషనల్ అయ్యారు.

    జయం రవికి భార్యకు మధ్య మనస్పర్థలు తలెత్తాయని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు దీనిపై స్పష్టత వచ్చింది. జయం రవి-ఆర్తి విడాకుల నేపథ్యంలో అభిమానులు ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జయం రవి బ్రదర్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. అలాగే మరొక తమిళ చిత్రం సెట్స్ పై ఉంది.