Homeఎంటర్టైన్మెంట్Jabardasth : జబర్దస్త్ మాజీ యాంకర్ కష్టాలు, చివరికి ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూసిందా?

Jabardasth : జబర్దస్త్ మాజీ యాంకర్ కష్టాలు, చివరికి ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూసిందా?

Jabardasth : జబర్దస్త్ పాప్యులర్ కామెడీ షో. ఈ షో వేదికగా పలువురు సామాన్యులు స్టార్స్ అయ్యారు. జబర్దస్త్ అనగానే అనసూయ, రష్మీ గుర్తుకు వస్తారు. గ్లామరస్ యాంకర్స్ గా వీరిద్దరూ ఆ షోకి గుర్తింపు తెచ్చారు. కాగా 2022లో అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంది. సినిమాల్లో బిజీ కావడం వలనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు అనసూయ వివరణ ఇచ్చింది. ఇది జబర్దస్త్ అభిమానులను బాధించింది. జబర్దస్త్ కి ఉన్న ఆదరణ రీత్యా అనసూయ స్థానంలోకి వచ్చే యాంకర్ ఎవరనే ఆత్రుత అందరిలో నెలకొంది. పలువురు తెలుగు యాంకర్స్ పోటీపడ్డారు. అనూహ్యంగా ఆ అదృష్టం కన్నడ అమ్మాయి సౌమ్యరావుకు దక్కింది.

Also Read : జబర్దస్త్ లో బూతు కామెడీ, ‘నువ్వు వస్తే పక్కే నలగదు’ అంటూ ఫైమా డైలాగ్… చూడలేం బాబోయ్!

చెప్పాలంటే జబర్దస్త్ యాంకర్ స్థానం అదృష్టంతో పాటు ఛాలెంజ్ కూడాను. అనసూయతో పోలికలు వస్తాయి. సౌమ్యరావుకు తెలుగు పూర్తిగా రాదు. దాంతో మొదట్లో తడబడింది. హైపర్ ఆది ఆమెకు చుక్కలు చూపిస్తూ ఉండేవాడు. తెలుగు మీద పట్టు లేకపోవడం వలన పంచులు అర్థం అయ్యేవి కావు. మెల్లగా సౌమ్యరావు సెటిల్ అయ్యింది. అయితే ఎక్కువ కాలం ఆమె జర్నీ సాగలేదు. సడన్ గా జబర్దస్త్ నుండి తీసేశారు.

జబర్దస్త్ యాంకర్ పోస్ట్ పోయినప్పటికీ తెలుగు షోలలో సౌమ్యరావు సందడి చేస్తుంది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన ఒకప్పటి కఠినమైన జీవితాన్ని వెల్లడించింది. నెలకు 400 జీతానికి ట్యూషన్స్ చెప్పేది అట. కాలేజ్ రోజుల్లో ఒక లాయర్ వద్ద టైపిస్ట్ గా పని చేసిందట. అలా జబ చేస్తూ చదువుకుంది అట. ఒక చిన్న ఛానల్ లో యాంకర్, ఆపై పెద్ద ఛానల్ లో యాంకర్ అయ్యిందట. సీరియల్స్ లో కూడా ఫస్ట్ చిన్న పాత్ర అనంతరం హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట.

తాను కెరీర్ లో అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చానని సౌమ్యరావు అన్నారు. కొందరు అమ్మాయిలకు మాత్రం వస్తూనే బంపర్ ఆఫర్స్ దక్కుతాయి. నెలల వ్యవధిలో కార్లు, ఫ్లాట్ సంపాదిస్తారు. అయితే క్యారెక్టర్ ముఖ్యం. నేను అది వదులుకోను. అలాంటి వాళ్లతో మాట్లాడను. ఒకప్పుడు నాకు తినటానికి తిండి కూడా ఉండేది కాదు. పక్కింటి వాళ్ళు తినగా మిగిలితే ఏమైనా ఇస్తారేమో అని ఎదురు చూసేదాన్ని.. అని సౌమ్యరావు, అన్నారు. విలువలతో బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో రాణించడం కష్టం అని ఆమె అభిప్రాయపడ్డారు.

Also Read : జబర్దస్త్ వర్ష అమ్మాయా? అబ్బాయా?.. ఎట్టకేలకు ఆ సీక్రెట్ బయటపెట్టిన బుల్లితెర స్టార్!

Exit mobile version