NTR Rajinikanth : కన్నడ చలన చిత్ర పరిశ్రమకి పవర్ స్టార్ గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసి సరిగ్గా ఏడాది కాలం అయ్యింది..రాజ్ కుమార్ నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్ హీరో గాను..రియల్ హీరోగానూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.. ఎన్నో సేవా కార్యక్రమాలు..ఎన్నో అనాధాశ్రమాలు, స్కూళ్ళు, వృద్ధాశ్రమాలు ఇలా పునీత్ రాజ్ కుమార్ చేసిన మంచి పనుల గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు
.అలాంటి మహానుబావుడు చనిపోవడం నిజంగా కర్ణాటక చేసుకున్న దురదృష్టం అనే చెప్పాలి..ఆయన లాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టడు..ఆయన లేని లోటు ఎవ్వరు పూడవలేనిది..అలాంటి మహానుభావుడు ని కర్ణాటక ప్రభుత్వం గుర్తిస్తూ ‘కర్ణాటక రత్న’ అనే బిరుదుని పునీత్ రాజ్ కుమార్ గారికి ఇచ్చింది.
ఇక ఈ బిరుదుని నవంబర్ 1 వ తేదీన కర్ణాటక లో ఒక భారీ బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి ఇవ్వనుంది కర్ణాటక ప్రభుత్వం..దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను స్వయంగా కర్ణాటక ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది..ఈ కార్యక్రమానికి కన్నడ సినీ పరిశ్రమకి చెందిన వారితో పాటుగా..ఇతర ఇండస్ట్రీలకు చెందిన సూపర్ స్టార్స్ ని కూడా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆహ్వానించారు..మన టాలీవుడ్ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం దక్కినట్టు సమాచారం..మీడియా సమక్షం లో ముఖ్యమంత్రి గారే ఈ విషయం ని తెలియచేసారు.
అలాగే తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ ని కూడా ఆహ్వానించారట..అలా అన్ని ఇండస్ట్రీస్ నుండి సూపర్ స్టార్స్ ఈ సభ కి హాజరు కాబోతుండడం తో అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున సెక్యూరిటీ ని పటిష్టంగా ఏర్పాటు చేశారట..పునీత్ రాజ్ కుమార్ గారితో ఎన్టీఆర్ కి ఎంతో సన్నిహిత్య సంబంధం ఉంది..ఈ సందర్భంగా పునీత్ గురించి ఎన్టీఆర్ ఏమి మాట్లాడబోతున్నాడు అని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.