Homeఎంటర్టైన్మెంట్Devara Movie Villain: దేవర విలన్ ని చూశారా... మైండ్ బ్లాక్ చేసేలా ఫస్ట్ లుక్!

Devara Movie Villain: దేవర విలన్ ని చూశారా… మైండ్ బ్లాక్ చేసేలా ఫస్ట్ లుక్!

Devara Movie Villain: ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో దేవర మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. నేడు సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దేవరలో సైఫ్ రోల్ నేమ్ భైరవ అట. ఉంగరాల జుట్టు, తీక్షణమైన చూపులు, నల్ల బట్టల్లో సైఫ్ లుక్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. ఎన్టీఆర్ కి బలమైన ప్రత్యర్థిగా భైరవ పాత్రను తీర్చిదిద్దారు అనడంలో సందేహం లేదు.

దేవర చిత్రంలో విలన్ రోల్ చాలా భయానకంగా ఉంటుందని కొరటాల శివ చెప్పకనే చెప్పారు. ఆయన చెప్పినట్లే సైఫ్ లుక్ ఆసక్తి రేపుతోంది. దేవర-భైరవ మధ్య పోరాటం భయంకరంగా ఉంటుందనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే కానుగా దేవర అప్డేట్ అదిరింది. దేవర ఒక్కో అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. దేవర సాగర తీరంలో నడిచే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్. రాక్షసులను భయపెట్టేవాడిగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని చెప్పారు.

ఇక దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పాత్ర కూడా కథలో చాలా కీలకమని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. లంగా ఓణీలో జాన్వీ కపూర్ పల్లెటూరి అమ్మాయిలా ఆసక్తి రేపింది. ఇక దేవర సమ్మర్ కానుకగా 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. దీంతో శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.

దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో దేవర తెరకెక్కిస్తున్నారు. వరుస షెడ్యూల్స్ తో తీరిక లేకుండా దేవర చిత్రీకరణ జరుగుతుంది. దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడం మరొక విశేషం. అలాగే దేవర విజయం కొరటాలకు చాలా కీలకం. ఆచార్య ఫలితంతో విమర్శలపాలైన కొరటాల దేవర చిత్రంతో కమ్ బ్యాక్ కావాలని అనుకుంటున్నారు…

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version