Junior NTR And Shah Rukh Khan: ఈమధ్య కాలం లో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అభిమానులకు అసలు నచ్చడం లేదు. ఉదాహరణకు #RRR చిత్రం కోసం ఆయన మూడేళ్ళ సమయాన్ని కేటాయించడం ఫ్యాన్స్ కి అంతగా నచ్చలేదు. ఎందుకంటే కథ రీత్యా అందులో కథానాయకుడు రామ్ చరణ్. ఎన్టీఆర్ సపోర్టింగ్ రోల్ చేసినట్టు గా అనిపించింది. ఈ సినిమా వల్ల సోషల్ మీడియా లో ఎన్టీఆర్ అభిమానులు ఇతర హీరోల ఫ్యాన్స్ చేత చాలా ట్రోల్స్ చేయించుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన హీరో గా నటించిన ‘దేవర’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. #RRR తో నిరాశ చెందిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఇచ్చిన కిక్ మామూలుది కాదు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన ‘వార్ 2’ చిత్రం చేసాడు.
ఇందులో హృతిక్ రోషన్ హీరో గా నటిస్తే, ఎన్టీఆర్ విలన్ గా నటించాడు. క్లైమాక్స్ వరకు ఆయన్ని విలన్ గానే చూపించారు మేకర్స్. కానీ అభిమానులు బాధపడుతారని చివర్లో పాజిటివ్ చేశారు. అయినప్పటికీ అభిమానులు సంతృప్తి చెందలేదు. ఎన్టీఆర్ కి అసలు ఇలాంటి పాత్రలు చేయాల్సిన కర్మ ఏంటి అని అభిమానుల అభిప్రాయం. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ మరో సారి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపించబోతున్నాడని, షారుఖ్ ఖాన్ ‘పఠాన్ 2’ లో ఆయనే విలన్ అని గత రెండు రోజులుగా ఒక ప్రచారం జరిగింది. నిర్మాత ఆదిత్య చోప్రా ఎన్టీఆర్ ని ‘పఠాన్ 2’ కోసం సంప్రదించిన విషయం వాస్తవమే. కానీ ఎన్టీఆర్ తనకు ఆసక్తి లేదని, ఇక మీదట ఇలాంటి రోల్స్ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నానని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
కానీ షారుఖ్ ఖాన్ అభిమానులకు మాత్రం నిరాశ ఎదురైంది. ఒక మంచి కాంబినేషన్ ని మిస్ అయిన ఫీలింగ్ కలిగింది అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం తన ద్రుష్టి మొత్తాన్ని ప్రశాంత్ నీల్ తో చేస్తున్న చిత్రం పైనే పెట్టాడు. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ని రెండు భాగాలుగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ పడింది. త్వరలోనే ఒక భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వచ్చే ఏడాది డిసెంబర్ నెలకు మొదటి భాగాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది.